బిజినెస్

మూడోరోజూ వెంటాడిన నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 22: నష్ట భయాలు వరుసగా మూడోరోజూ మదుపర్లను వెంటాడాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లకు నష్టాల బెడద కొనసాగింది. అంతర్జాతీయ ఏజెన్సీలు దేశ స్థూల వ్యవసాయోత్తి (జీడీపీ) వృద్ధిరేటును తగ్గించడం, కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండడం వంటి అంశాలతోబాటు రాబోయే కేంద్ర బడ్జెట్‌పై అందరి నిశిత దృష్టీ కేంద్రీకృతం కావడమే ఇందుకు కారణాలు. ఈ క్రమంలో బుధవారం ఆరంభంలో లాభాలను నమోదు చేసిన సూచీలు ఆ తర్వాత నష్టాల్లోకి జారాయి. ఇంధన, విద్యుత్, వాహన, ఫైనాన్షియల్ స్టాక్స్ తీవ్ర అమ్మకాల వత్తిడికి గురయ్యాయి. సెనె్సక్స్ రోజంతా ఒడిదుడుకులకు గురైంది.
ఓ దశలో 473 పాయింట్లు కోల్పోయిన బీఎస్‌ఈ 30 షెర్ల సూచీ సెనె్సక్స్ చివరికి 208.43 పాయింట్ల (0.50 శాతం) నష్టంతో 41,115.38 పా యింట్ల దిగువన స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూ చీ 41,115.38 పాయింట్ల గరిష్టానికి, 41,059.04 పాయింట్ల కనిష్టానికి చేరి ఊగిసలాడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 62.95 పాయింట్లు (0.52 శాతం) కోల్పోయి 12,106.90 పాయింట్ల దిగువన స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లో ఓఎన్‌జీసీ అత్యధికంగా 5.3 శాతం నష్టపోయింది. అలాగే ఎన్‌టీపీసీ, మారుతి, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఏసియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ సైతం నష్టాలపాలయ్యాయి. మరోవైపు నెస్టల్ ఇండియా, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, ఎస్‌బీఐ, భారతి ఎయిర్‌టెల్ 1.86 శాతం లాభాలను సంతరించుకున్నాయి.
లాభాల్లో ఆసియా మార్కెట్లు
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బుధవారం స్తబ్దుగా మిగిలింది. ఇంట్రాడేలో 71.22 గా ట్రేడైంది. ఇక ఆసియా ఖండ దేశాల్లో షాంఘై, హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ స్టాక్ మార్కెట్లు లా భాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లు సైతం ఆరం భ ట్రేడింగ్‌లో లాభాలనే నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.67 శాతం తగ్గుదలతో బ్యారెల్ 64.16 డాలర్ల వంతున ట్రేడైంది.