బిజినెస్

డిజిటల్ లావాదేవీల్లో దూసుకెళ్తున్న తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: డిజిటల్ సొమ్ము చెల్లింపుల్లో తెలంగాణ రాష్ట్రం దూసుకెళుతోంది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడైనట్లు పే వరల్డ్ సంస్థ పేర్కొంది. ఈ వ్యవస్థ ద్వారా 200,897 మంది రిటైలర్లు నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలోని పెద్ద నగరాలతో పాటు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు కలిపి మొత్తం 31 జిల్లాల్లో పేవరల్డ్ డిజిటల్ రూపంలో సొమ్ము చెల్లింపుల సేవలను అందిస్తోంది. రోజుకు 450 మంది ఆదార్ ఆధారిత డిజిటల్ సేవలు వినియోగించుకుంటున్నారు. నెలకు దాదాపు 70 వేల మంది ఆధార్ ఆధారిత డిజిటల్ సేవలు చెల్లిస్తున్నారు. సగటున రూ.2900 వరకు చెల్లింపులు నమోదు చేసినట్లు ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ దాబాయ్ చెప్పారు. రోజుకు మొత్తం అన్ని రకాలుగా 9500 చెల్లింపులు నమోదవుతున్నాయి. ప్రజల్లో డిజిటల్ చెల్లింపుల పట్ల అవగాహన బాగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ కామర్స్, సొమ్ము చెల్లింపులు, రుణాలు మ్యూచువల్ ఫండ్స్, బీమా తదితర సేవలను పే వరల్డ్ అందిస్తోంది. రాష్ట్రప్రభుత్వం కూడా డిజిటల్ చెల్లింపుల సేవలను విశేషంగా ప్రోత్సహిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థపై విశ్వాసం పెరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల నుంచి 95వేల వరకు రైల్వే టిక్కెట్లు కూడా డిజిటల్ చెల్లింపుల ద్వారా బుక్ అయినట్లు ఆయన చెప్పారు.