బిజినెస్

ట్రైబర్ ఏఎంటీ వెర్షన్‌ను ఆవిష్కరించిన రెనాల్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్ నోయిడా, ఫిబ్రవరి 5: ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ బుధవారం నాడిక్కడ జరిగిన ఆటో ఎక్స్‌పోలో తన ట్రైబర్ వాహనం ఏఎంటీ (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) వెర్షన్‌ను ప్రారంభించింది. రెనాల్ట్ గ్రూప్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్, ఆఫ్రికా-మధ్యప్రాచ్యం-్భరత్-పసిఫిక్ రీజియన్ చైర్మన్ ఫాబ్రిస్ కాంబోలైవ్.. రెనాల్ట్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రాం మామిళ్లపల్లెతో కలిసి ట్రైబర్ ఏఎంటీ వెర్షన్‌ను ప్రారంభించారు. దేశీయ మార్కెట్‌లో రెనాల్ట్ వాహనాల అమ్మకాలలో ట్రైబర్ కీలక పాత్ర పోషిస్తోంది. గత సంవత్సరం ఆగస్టులో ఈ ఏడు సీట్ల కారును మార్కెట్‌లోకి విడుదల చేసినప్పటి నుంచి 28వేలకు పైగా యూనిట్లు అమ్ముడుపోయాయి. ‘్భరత ఆటోమొబైల్ మార్కెట్‌లో అతిపెద్ద, అతివేగంగా వృద్ధి చెందుతున్న సెగ్మెంట్‌లో మేము నిలబడటానికి రెనాల్ట్ ట్రైబర్ మాకు అవకాశం కల్పించింది. ఈరోజు మేము ట్రైబర్ యాత్రలో మరో ముందడుగు వేయబోతున్నాం. రెనాల్ట్ ట్రైబర్ ఈజీ-ఆర్ ఏఎంటీని విడుదల చేస్తున్నాం’ అని మామిళ్లపల్లె చెప్పారు. ‘రెనాల్ట్ ట్రైబర్ ఈజీ-ఆర్ ఏఎంటీతో మేము 2020లోనూ మా వృద్ధి రేటును కొనసాగిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.