బిజినెస్

లాభాల్లో దేశీయ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా పుంజుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెన్సెక్స్ వరుసగా మూడో రోజు పైకి ఎగబాకింది. చైనాలో వేగంగా విస్తరిస్తూ వివిధ దేశాలను కలవరపరుస్తున్న కొత్త కరోనా వైరస్‌కు చికిత్సలో పురోగతి సాధించినట్టు వచ్చిన వార్తలు ప్రపంచ ఇనె్వస్టర్లలో ఉత్సాహాన్ని నింపడంతో సెనె్సక్స్ బుధవారం 353 పాయింట్లు పుంజుకుంది. భారతదేశ సేవారంగ కార్యకలాపాలు జనవరి నెలలో ఏడేళ్ల గరిష్ఠ స్థాయికి పెరిగినట్టు ఒక సర్వే వెల్లడించిన తరువాత బిజినెస్ సెంటిమెంట్ మెరుగుపడటంతో దేశీయ మదుపరులు కూడా ఉత్సాహంగా కొనుగోళ్లకు పూనుకున్నారు. బీఎస్‌ఈ సెనె్సక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే బుధవారం 353.28 పాయింట్లు (0.87 శాతం) ఎగువన 41,142.66 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ ఇంట్రా-డేలో ఒక దశలో 41,154.66 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ బుధవారం 109.50 పాయింట్లు (0.91 శాతం) పుంజుకొని 12,089.15 పాయింట్ల వద్ద స్థిరపడింది.
సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో టాటా స్టీల్ అత్యధికంగా లాభపడింది. ఈ కంపెనీ షేర్ ధర బుధవారం 5.14 శాతం పెరిగింది. భారతి ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ తరువాత స్థానాల్లో నిలిచాయి. మరోవైపు, హీరో మోటోకార్ప్ అత్యధికంగా నష్టపోయింది. ఈ కంపెనీ షేర్ విలువ 3.83 శాతం పడిపోయింది. పవర్‌గ్రిడ్, మారుతి, ఆసియన్ పెయిం ట్స్, నెస్టిల్ ఇండియా కూడా నష్టాలతో ముగిశాయి.
కరోనా వైరస్ చికిత్సకు సంబంధించిన పరిశోధనలో పురోగతి సాధించినట్టు వచ్చిన వార్తలు ప్రపం చ స్టాక్ మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపాయని విశే్లషకులు పేర్కొన్నారు. షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్ స్టాక్ మార్కెట్లు కూడా 1.25 శాతం ఎగువ న ముగిశాయి. యూరప్‌లోని స్టాక్ మార్కెట్లు కూ డా పటిష్టమయిన స్థితి వద్ద ప్రారంభమయ్యాయి.
జనవరి నెల స్టెల్లార్ బిజినెస్ డాటా పాయింట్ల విడుదల దేశీయ స్టాక్ మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపాయని విశే్లషకులు పేర్కొన్నారు. కొత్త బిజినెస్ ఆర్డర్ల రాక గణనీయంగా పెరగడంతో దేశ సర్వీస్ సెక్టార్ యాక్టివిటి జనవరి నెలలో ఏడేళ్ల గరిష్ఠ స్థాయికి పెరిగింది. ఇది ఉద్యోగాల పెరుగుదలకు, వ్యాపార ఆశావహత పెరుగుదలకు తోడ్పడింది. ఇది దేశీయ స్టాక్ మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపడానికి తోడ్పడింది.