బిజినెస్

మార్కెట్లపై కరోనా పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: చైనాలో ఉద్భవించిన ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య పెరగడం, అలాగే ఆర్థికపరంగా కూడా నష్టం వాటిల్లడంతో మార్కె ట్లు కకావికలమవుతున్నాయి. సోమవారం భారతీయ మార్కెట్ల లావాదేవీల తీరే ఇందుకు అద్దం పడుతోంది. తాజా వాతావరణాన్ని ప్రతిబింభిస్తూ సెనె్సక్స్ 162.23 పాయింట్లు పతనమై 40 వేల 979.62గా ముగిసింది.
అలాగే నిఫ్టీ కూడా వివిధ దశల్లో ఊగిసలాడి లావాదేవీలు ముగిసే నాటికి 66.85 పాయింట్లు నష్టపోయి 12,031.50 వద్ద ముగిసింది. ముఖ్యంగా ఆటో మెటల్ రంగానికి చెందిన షేర్లు భారీగా నష్టపోయాయి. మహేంద్ర అండ్ మహేంద్ర 7 శాతానికి పైగా షేర్ విలువ తగ్గింది. టాటా స్టీల్, ఓఎన్‌జీసి, సన్ ఫార్మా, హీరో మోటో కార్ప్ షేర్లు పతనమయ్యాయి. అయితే బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వల్పంగా పెరిగాయి. సెక్టార్ల వారీగా మెటల్ (3.14%), ఆటో (2.37%), విద్యుత్తు, వినియోగ వస్తువులు (1.66, 1.64% చొప్పున) పతనమయ్యాయి. కరోనా వైరస్ మరింతగా తీవ్రమైతే చైనా నుంచి విడి భాగాల సరఫరా ఆగిపోతుందన్న ఆందోళన ఆటో రంగానికి చెందిన పరిశ్రమలను పీడిస్తున్నదని విశే్లషకులు చెబుతున్నారు. దీని కారణంగానే ఈ రంగానికి చెందిన షేర్లు పతనమైనట్లుగా భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ వాహనాల అమ్మకాలు కూడా తగ్గిపోవడం ఇందుకు మరింతగా కారణమైంది. సమీప భవిష్యత్తులో దేశంలోని కర్మాగారాలు మళ్లీ పుంజుకుంటే తప్ప వాస్తవ పరిస్థితులు ఏమిటో స్పష్టమయ్యే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. కరోనా వైరస్ కారణంగా చైనాలో ఇప్పటికే 900 మంది మరణించడం, 40 వేల మందికి పైగా ఈ వైరస్ సోకడంతో ఆర్థికపరంగా కూడా మార్కెట్లపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. కాగా హాంగ్-కాంగ్, టోక్యో, సియోల్ మార్కెట్లు కూడా నష్టాన్ని చవి చూశాయి.