బిజినెస్

మార్కెట్లకు ‘ఫెడ్’ ఊపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 22: వడ్డీ రేట్లను కొనసాగించాలన్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాలతో ముగిసిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ 266 పాయింట్లు లాభపడి రెండు వారాల గరిష్ఠ స్థాయి అయిన 28,773.13 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎఖ్సచేంజి సూచీ నిఫ్టీ సైతం 90.30 పాయింట్లు లాభపడి మళ్లీ 8,800 పాయింట్ల ఎగువన ముగిసింది. హెచ్‌ఐవి చికిత్సలో ఉపయోగించే డోలుటెగ్రేవిర్ తయారీకి అమెరికా ఔషధ నియంత్రణ మండలినుంచి తాత్కాలిక ఆమోదం లభించిందన్న వార్తతో అరబిందో ఫార్మా షేరు ఏకంగా 6 శాతం పెరిగింది. అయితే రూపాయితో డాలరు విలువ కాస్త బలహీన పడిన నేపథ్యంలో టిసిఎస్, విప్రోలాంటి కొన్ని సాఫ్ట్‌వేర్ ఎగుమతి సంస్థల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెనె్సక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 23 షేర్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా, తైవాన్ లాంటి ప్రధాన మార్కెట్ల సూచీలన్నీ కూడా లాభాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు సైతం 1.65 శాతం దాకా లాభపడ్డాయి.
మార్కెట్లలోకి ఎల్‌అండ్‌టి టెక్నాలజీ సర్వీసెస్
ఇదిలా ఉండగా ఇటీవల తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపిఓ)ను విజయవంతంగా ముగించుకున్న ఎల్‌అండ్‌టి టెక్నాలజీ సర్వీసెస్ శుక్రవారం తొలిసారిగా మార్కెట్లలో ప్రవేశించనుంది. ఈ నెల 12-15 తేదీల మధ్య మార్కెట్లోకి వచ్చిన ఈ కంపెనీ ఐపిఓ 2.53 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయిన విషయం తెలిసిందే. ఐపిఓలో కంపెనీ షేరు ధరను రూ. 250-260 మధ్య నిర్ణయించిన విషయం తెలిసిందే.