బిజినెస్

మార్కెట్లకు భారీ నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 29: ఈవారం స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు తప్పలేదు. సోమవారం ట్రేడింగ్ మొదలైనప్పటి నుంచి చివరి రోజైన శుక్రవారం వరకూ మార్కెట్లు కోలుకోలేకపోయాయి. కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల మాదిరిగానే స్టాక్ మార్కెట్లపైన కూడా తీవ్రంగా కనిపించింది. చైనా నుంచి ఈ వైరస్ ప్రపంచంలోని పలు దేశాలకు వ్యాప్తి చెందిన నేపథ్యంలో మదుపరులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. చైనా నుంచి దిగుమతులను వివిధ దేశాలు నిలిపివేసిన తరుణంలో, ఏఏ రంగాలపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందనే విశే్లషణలో మునిగిపోయారు. ఫలితంగా ఈవారం బేర్ స్లంప్ నమోదైంది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ మొత్తం మీద 2,872.83 పాయింట్లు పతనం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. కరోనా వైరస్ తాజాగా దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్‌లలోనూ ప్రబలమైన ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. అసాధారణ రీతిల్యోవ మార్కెట్ల పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లలో కరోనా కలకలం భారత్‌సహా అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతిబింబించింది. ఫలితంగా ఈవారం ట్రేడింగ్‌కు మొదటి రోజైన సోమవారం సెనె్సక్స్ ఏకంగా 807 పాయింట్లు పతనమైంది. ముఖ్యంగా చైనాలో ఈ వైరస్ కేసులు మరింత తీవ్రం కావడంతోపాటు ఇతర దేశాల్లోనూ వ్యాపించడం మార్కెట్లను కుదేలు చేసింది. రోజు మొత్తంలో వివిధ దశల్లో ఊగిసలాడిన సెనె్సక్స్ అంతిమంగా 806.89 పా యింట్లు పతనమై 40,363.23 వద్ద ముగిసింది. ఈనెల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఈనెల ఒకటో తేదీన సెనె్సక్స్ 987 పాయింట్లు పతనమైంది. జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా 251.45 పాయింట్లు పతనమై 11,829.40 వద్ద ముగిసింది. రెండో రోజైన మంగళవారం ఆ స్థాయిలో పతనం లేకపోయినప్పటికీ, నిలకడలేకుండా కొనసాగిన ట్రేడింగ్ చివరికి మార్కెట్లను నష్టాల్లోనే నిలబెట్టింది. సెనె్సక్స్ 82.03 పాయింట్ల నష్టంతో 40,281.20 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 31.50 పాయింట్లు తగ్గడంతో 11,797.90 పాయింట్లుగా నమోదైంది. కాగా, బుధవారం ఇంట్రా-డేలో ఒక దశలో 521 పాయింట్లు పడిపోయిన సెనె్సక్స్ సూచీ చివరకు 392.24 పాయింట్ల (0.97 శాతం) దిగువన 39,888.96 పాయింట్ల వద్ద ముగిసింది. అదేవిధంగా నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే బుధవారం 119.40 పా యింట్లు (1.01 శాతం) దిగువన 11,678.50 పాయింట్ల వద్ద స్థిరపడింది. గురువారం కూడా మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. సెనె్సక్స్ 143.30 పాయింట్లు (0.36 శాతం) పతనమై 39,745.66 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 45.20 పాయింట్లు (0.39 శాతం) పడిపోవడంతో 11,633.30 పాయింట్లుగా నమోదైంది. ఇక, లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం మార్కెట్లకు చీకటి రోజునే మిగిల్చాయ. సెనె్సక్స్ ఏకంగా 1,448.37 పాయింట్ల (3.64 శాతం) పతనమై, 38,297.29 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ సూచీలు 431.55 పాయింట్లు తగ్గడంతో, 11,201.75 పాయింట్లకు చేరింది. కరోనా వైరస్ ప్రభావంతోపాటు, వివిధ దేశాల్లో నెలకొన్న ఆర్థిక మాంద్య పరిస్థితులు మార్కెట్ల పతనానికి కారణంగా చెప్తున్నారు. వచ్చే వారం కూడా ఇలాంటి పరిస్థితి తప్పకపోవచ్చని పరిశీలకులు అంటున్నారు.