బిజినెస్

వారాంతంలో నష్టాల్లోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 23: వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయంతో గురువారం ఉరకలేసిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం చతికిల పడ్డాయి. బ్యాకింగ్ స్టాక్స్ లాంటి ఇటీవల లాభాలు ఆర్జించిన స్టాక్స్‌లో లాభాల స్వీకరణకు మదుపరులు దిగడంతో వారాంతంలో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ సెనె్సక్స్ 105 పాయింట్లు నష్టపోయి 28,668.22 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 33.90 పాయింట్లు నష్టపోయి 8,831.55 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే సూచీలు గత నాలుగు వారాల్లో మూడు వారాలు లాభాలతోనే ముగియడం గమనార్హం. సెనె్సక్స్ 69.19 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 51.70 పాయింట్లు లాభపడింది. ప్రధాన బ్యాంకింగ్ షేర్లన్నీ నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్ షేరు ఏకంగా 5.84 శాతం నష్టపోగా, ఐసిఐసిఐ బ్యాంక్ షేరు 1.36 శాతం, ఎస్‌బిఐ షేరు 1.15 శాతం నష్టపోయాయి. కాగా, శుక్రవారం మార్కెట్లలోకి ప్రవేశించిన ఎల్‌అండ్‌టి టెక్నాలజీ సర్వీసెస్ షేరు తొలి రోజు 0.59 శాతం పెరిగింది. ఆ షేరు ఇష్యూ ధర రూ. 860 అయితే ఒక దశలో 931 రూపాయల దాకా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రధాన ఆసియా మార్కెట్ల సూచీలు నష్టాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లలో కూడా అదే ధోరణి కనిపించింది. సెనె్సక్స్‌లోని 30 షేర్లలో 17 షేర్లు నష్టపోయాయి. ప్రధానంగా నష్టపోయిన వాటిలో లుపిన్, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, టాటా మోటార్స్, గెయిల్, సన్‌ఫార్మా ఉన్నాయి. అయితే ఇండెక్స్ హెవీ వెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 1.41 శాతం పెరగ్గా, డాక్టర్ రెడ్డీస్, టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఒఎన్‌జిసి షేర్లు కూడా మంచి లాభాలనే ఆర్జించాయి. ఇదిలా ఉండగా, ఇటీవల ఐపిఓ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఆటో పరికరాల తయారీ సంస్థ జిఎన్‌ఏ యాక్సిల్స్ సోమవారం రెండు ప్రధాన ఎక్స్‌చేంజిలలోను మదుపరులకు అందుబాటులోకి రానుంది.