బిజినెస్

ఎస్‌టిపిసిలో ఆగిన విద్యుదుత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(పరవాడ), సెప్టెంబర్ 24: సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీపీసీ) రెండవ ఐదు వందల మెగావాట్ల విద్యుత్ యూనిట్‌లో సాంకేతిక లోపంతో శనివారం ఉత్పత్తి నిలిచి పోయింది. రెండవ యూనిట్‌కు సంబంధించిన బాయిలర్ ట్యూబ్స్‌లో సాంకేతిక లోపం తల్తెతడంతో సింహాద్రి అధికారులు రెండవ యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తిని శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమంయలో నిలిపి వేశారు. బాయిలర్ ట్యూబ్స్‌లో గల సాంకేతిక లోపాన్ని సరి చేసి తిరిగి రెండవ యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి చేపట్టేందుకు 24గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత మూడు రోజుల నుండి బాయిలర్ ట్యూబ్స్‌లో సమస్య ఉత్పన్నమైందని, దీనిని అధికారులు పరిశీలిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రక్రియ చేపట్టారు. కానీ, సమస్యకు పరిష్కారం లభించక పోవడంతో శనివారం మధ్యాహ్నం రెండవ యూనిట్‌ను షట్‌డౌన్ చేశారు.
దీనికారణంగా 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. ప్రస్తుతం సింహాద్రిలో 1,3,4 యూనిట్లు కలిసి సుమారు 1500 మెగావాట్ల విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తున్నాయి.