బిజినెస్

మ్యూచువల్ ఫండ్స్‌లో మరో మూడు లక్షల ఇనె్వస్టర్ ఖాతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఫిబ్రవరి నెలలో కొత్తగా మూడు లక్షలకు పైగా ఇనె్వస్టర్ ఖాతాలను తెరచింది. దీంతో ఈ పరిశ్రమలో మొత్తం ఇనె్వస్టర్ ఖాతాల సంఖ్య 8.88 కోట్లకు పెరిగింది. ఇలాంటి పథకాలలో ఉన్న మార్కెట్ రిస్క్‌ల గురించి మదుపరులకు గల అవగాహనను ఇది సూచిస్తోంది. అయితే, అంతకు ముందు రెండు నెలలతో పోలిస్తే ఫిబ్రవరి నెలలో ఇనె్వస్టర్ ఖాతాల సంఖ్య వృద్ధిలో వేగం తగ్గింది. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ జనవరి నెలలో 14 లక్షల ఇనె్వస్టర్ ఖాతాలను తెరచింది. అదేవిధంగా 2019 డిసెంబర్ నెలలో ఆరు లక్షల ఇనె్వస్టర్ ఖాతాలను తెరచింది. అయితే, మ్యూచువల్ ఫండ్ సంస్థలు 2019 నవంబర్ నెలలో మాత్రం కేవలం 2.6 లక్షల ఇనె్వస్టర్ ఖాతాలను తెరిచాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా గణాంకాల ప్రకారం, దేశంలోని 44 మ్యూచువల్ ఫండ్ సంస్థల వద్ద జనవరి నెలలో 8,85,33,153 ఇనె్వస్టర్ ఖాతాలు ఉండగా, ఫిబ్రవరి నెలాఖరు నాటికి వాటి సంఖ్య 8,88,36,162కు పెరిగింది. అంటే ఫిబ్రవరి నెలలో 3.03 లక్షల ఇనె్వస్టర్ ఖాతాలు పెరిగాయి. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంపై ఆందోళనలు నెలకొని ఉన్న సమయంలో బ్రాడర్ మార్కెట్‌లో తీవ్ర అనిశ్చితి ఏర్పడిన పరిస్థితుల్లో మ్యూచుల్ ఫండ్ పరిశ్రమలో ఫిబ్రవరిలో 3.03 లక్షల ఇనె్వస్టర్ ఖాతాలు కొత్తగా ప్రారంభమయ్యాయి. ఇనె్వస్టర్ ఖాతాల సంఖ్య పెరగడం అనేది మ్యూచువల్ ఫండ్ పథకాలలో ఉన్న మార్కెట్ రిస్క్‌ల గురించి మదుపరులకు గల అవగాహనను వెల్లడిస్తోందని పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు.