బిజినెస్

విద్యుత్ శాఖకు రూ. 56 కోట్లు ఆదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 13: సంక్షోభ కాలంలోనూ ప్రజాధనం ఆదా చేయడంపై దృష్టి పెట్టినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ తెలిపింది. మార్చి నెలలో చౌకగా లభించే విద్యుత్ కొనుగోలు చేసి 56కోట్ల రూపాయల మేర మిగిల్చినట్లు వెల్లడించింది. కరోనా నేపథ్యంలో మార్చిలో సంస్థ పరిస్థితిపై ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ సోమవారం సమీక్ష జరిపారు. ఆ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖరరెడ్డి సోమవారం విలేఖరులకు తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యుత్ ధరలు తగ్గడాన్ని గుర్తించి మార్కెట్లో లభించే చౌక విద్యుత్‌ను కొనుగోలు చేశారు. మార్చిలో 357.22 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేశారు. యూనిట్‌కు గరిష్ఠంగా 2.64 రూపాయల ధర చెల్లించారు. విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించిన ధర కన్నా ఇది యూనిట్‌కు రూ.1.57 తక్కువ. లాక్‌డౌన్ ప్రకటించడంతో ఇంధన శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రిడ్ నిర్వహణ, డిమాండ్‌ను అంచనా వేయడం, మార్కెట్లో విద్యుత్ లభ్యత, ధర, ఏ సమయంలో కొనుగోలు చేయవచ్చనే విశే్లషణలు చేపట్టడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. చౌక విద్యుత్ కొనుగోలు వల్ల బొగ్గు నిల్వలు పెరిగాయని, ప్రస్తుతం 21రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఈ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. సంక్షోభ కాలాన్ని అవకాశంగా మలుచుకుని విద్యుత్ కొనుగోలు భారాన్ని తగ్గించుకునేందుకు ఏపీ ట్రాన్స్‌కో చేస్తున్న ప్రయత్నాలను మంత్రి అభినందించారు.