బిజినెస్

ముడి చమురు ధరలు భారీగా పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 24: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరోసారి భారీగా పతనమైనాయి. ఇటీవలి కాలంలో కాస్త పుంజుకుంటున్నట్లు కనిపించిన చమురు ధరలు మళ్లీ పతనమవడం కలకలం రేపుతోంది. ఈ నెల 28న అల్జీరియాలో రష్యా వంటి ఒపెక్‌లో సభ్య త్వం లేని చమురు ఉత్పత్తి దేశాలతో ఒపెక్ కీలక సమావేశం కానున్న నేపథ్యంలో చమురు ధరలు పతనం కావ డం ప్రాధాన్యతను సంతరించుకుంది. శుక్రవారం లండన్ మార్కెట్లో భారత్ ఎక్కువగా కొనుగోలు చేసే బ్రెంట్ చమురు బ్యారెల్ 1.76 డాలర్లు పడిపోయి 45.89 డాలర్లకు చేరుకుంది. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు సైతం బ్యారెల్‌కు 4 శాతం పడిపోయి 44.48 డాలర్లకు చేరుకుంది.
గత రెండేళ్లుగా భారీ నష్టాలను మూటగట్టుకుంటున్న ముడి చమురు ధరలను స్థిరంగా ఉంచడం కోసం సరఫరాలపై నియంత్రణలు తీసుకు రావాలని ప్రపంచంలో అత్యధికంగా చమురును ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియా ఇటీవల డిమాండ్ చేసింది. అంతేకాదు ఆ దిశగా చమురు ఉత్పత్తి దేశాలన్నిటినీ ఒకే తాటిపైకి తీసుకు రావడానికి కూడా ప్రయత్నిస్తోంది. అయితే ఈ నెల 26నుంచి 28 దాకా అల్జీరియాలో జరగబోయే సమావేశంపై ఇప్పటికే ప్రతికూల అంచనాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇదే విధంగా ఓపెకేతర దేశాలతో ఒపెక్ నిర్వహించిన సమావేశం విఫలం కావడమే ఈ అంచనాలకు ప్రధాన ఆదారమని విశే్లషకులు అంటున్నారు. అలాగే ఫిజికల్ కమోడిటీస్‌లో బ్యాంకుల జోక్యంపై నియంత్రణ విదించాలన్న యోచనలో ఉన్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానం, బలపడుతున్న డాలరు విలువ, విద్యుత్ ధరలు, పెరిగిన చమురు ఎగుమతులు, ఒపెక్, నాన్ ఒపెక్ దఏవాల మధ్య పెరుగుతున్న విభేదాలు లాంటివన్నీ కూడా ముడి చమురు ధరల పతనానికి కారణాలుగా విశే్లషకులు చెబుతున్నారు. ఒపెక్‌కు వెలుపల చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో అగ్రస్థానంలో ఉన్న రష్యాలో చమురు ఉత్పత్తి గత వారం రికార్డు స్థాయికి చేరుకోవడం కూడా కారణమేనని చెబుతున్నారు. అయితే సౌదీ అరేబియా ప్రతిపాదనకు రష్యా మద్దతు పలకడంతో అల్జీరియా సమావేశంపై ఒపెక్ సభ్య దేశాల్లో ఆశలు పెరిగాయి.