బిజినెస్

ఎగుమతుల నాణ్యతపై భారత్‌తో సమన్వయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: ఎగుమతుల నాణ్యత విషయంలో భారత్, యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ రెగ్యులేటర్ అథారిటీ (యుఎస్ ఎఫ్‌డిఎ) మధ్య సమన్వయం, ప్రతిభావంతమైన సహకారానికి ప్రాధాన్యం ఇస్తున్నామని యుఎస్ ఎఫ్‌డిఎ డైరెక్టర్ మాథ్యూ టి థామస్ అన్నారు. విశాఖలో జరుగుతున్న ఇండియా, ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో ముగింపు సందర్భంగా ఆదివారం జరిగిన టెక్నికల్ సెషన్‌లో ఆయన మాట్లాడారు. భారత్ నుంచి ఆక్వా ఎగుమతుల తిరస్కారాన్ని అతి తక్కువ చేసేందుకు సాగులో ఉత్తమ పద్ధతులు అనుసరించాలన్నారు. ఎఫ్‌డిఎ తన నిబంధనలను సమర్ధించుకుందని, ఇదే సందర్భంలో ప్రధాన భారతీయ ఎగుమతిదారులు రెగ్యులేటరీ బాడీతో విస్తృత సహకారం అందించాలన్నారు. ఈ దిశగా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందని పేర్కొన్నారు. తద్వారా భారతదేశంలో రొయ్యల సాగులో నాణ్యతా ప్రమాణాలు పెరిగాయని, ఇది భారత ఎగుమతిదారుల్లో అనూహ్య చైతన్యానికి దారితీసిందన్నారు. భారత్‌లోని యుఎస్ ఎఫ్‌డిఎ ఆక్వా రైతుల నుంచి, ఎగుమతి దారుల నుంచి వచ్చే ఎటువంటి సూచనలైనా ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ ఏడోస్థానంలో ఉందని, మరింత నాణ్యమైన ఎగుమతులతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని సూచించారు.