బిజినెస్

ముగిసిన సీ ఫుడ్ షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: మెరైన్ ప్రోడక్స్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఎంపెడా), సీ ఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ నెల 23 నుంచి విశాఖలో నిర్వహించిన ఇండియా ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో ఆదివారంతో ముగిసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించగా, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధి లక్ష్యంగా మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శలో పలు దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఆక్వా, సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో 7వ స్థానంలో ఉన్న భారతదేశంలో 40 శాతం ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ నుంచే ఎగుమతవుతున్నాయి. రాష్ట్రంలో సువిశాల తీర ప్రాంతంతో పాటు ఆక్వా రంగం పురోగతి సాధిస్తోంది. అయితే, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో చోటుచేసుకుంటున్న ఇబ్బందులు, సాగు మెళకువలపై దేశ, విదేశాల నుంచి వచ్చిన నిపుణులు, ప్రతినిధులతో టెక్నికల్ సెషన్స్ నిర్వహించారు. ఆక్వా పరిశ్రమలో ఉపయోగించే యంత్రాలు, మందుల తయారీ కంపెనీలు తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. దేశీంగా ఆక్వా సాగును ప్రోత్సహించడంతో పాటు ఎగుమతులకు అనుకూలంగా ఉత్పత్తి పెంచుకునే విధంగా రైతులు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. సదస్సులో ఎంపెడా చైర్మన్ జయ తిలక్, ఎక్స్‌పోర్ట్స్ ఇనస్పెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎస్‌కె సక్సేనా, టెక్నికల్ డైరెక్టర్ మండలిక్, యుఎస్ ఎఫ్‌డిసి కంట్రీ డైరెక్టర్ తదితరులు ఎగుమతుల్లో పాటించాల్సిన నిబంధనలు, యాంటీ బయోటిక్స్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆక్వా రైతులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎగుమతిదారులు తీసకువాల్సిన జాగ్రత్తలతో పాటు, బీమా పథకాలు వంటి వాటిపై నిపుణులు సూచనలిచ్చారు. సీ ఫుడ్ షో చివరి రోజు ఆదివారం ఎగ్జిబిషన్‌కు సందర్శకులను అనుమతించారు.