బిజినెస్

జిడిపి 8 శాతం పైనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తదుపరి రెండు త్రైమాసికాల్లో దేశ వృద్ధి రేటు 8 శాతంకంటే ఎక్కుగా నమోదవడం ఖాయమని, రుతుపవనాలు ఎంతో మెరుగ్గా ఉండటం, కేంద్ర ప్రభుత్వం సకాలంలో విధాన నిర్ణయాలను తీసుకోగలుగుతుండటంతో పాటు ఆర్థిక సంస్కరణల వేగం పెరగడం వృద్ధి రేటు పెరిగేందుకు ఎంతగానో దోహదపడతాయని భావిస్తున్నట్లు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా స్పష్టం చేశారు. ‘రుతుపవనాలు ఎంతో చక్కగా ఉండటంతో పాటు సంస్కరణల ప్రభావం వలన వచ్చే రెండు త్రైమాసికాల్లో స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) రేటు 8 శాతం కంటే ఎక్కువగా నమోదవుతుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నా. ఇప్పటివరకూ మనం సంస్కరణల ప్రభావాన్ని చూడలేదు. అలాగే ఇంతకుముందు పరిపాలనా పరమైన సమస్యలు తీవ్రంగా ఉండటం, కేంద్ర ప్రభుత్వం స్థాయిలో సరిగా నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో పలు అభివృద్ధి ప్రాజెక్టులు నిలిచిపోయాయి’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో మైనింగ్, నిర్మాణ, వ్యవసాయ రంగాల పనితీరు కుంటుపడటంతో జిడిపి వృద్ధిరేటు ఆరు త్రైమాసికాల కనిష్ఠ మధ్య కాలంలో 7.9 శాతంగా నమోదైన జిడిపి గత ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో 7.5 శాతం వృద్ధిని సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో జిడిపి వృద్ధి రేటు తన అంచనాల కంటే స్వల్పంగా తగ్గి 7.1 శాతంగా నమోదైందని, తొలి త్రైమాసిక గణాంకాలపై రుతుపవనాల ప్రభావం లేకపోవడమే ఇందుకు కారణమని పనగరియా తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వరి ధాన్యంతో పాటు పప్పుదినుసుల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో గత ఖరీఫ్ సీజన్‌లో 124.01 మిలియన్ టన్నులుగా ఉన్న ఆహార ధాన్యాల దిగుబడి ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 9 శాతం పెరిగి 135.03 మిలియన్ టన్నుల ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది.

చిత్రం..నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా