బిజినెస్

ఆటుపోట్లకే అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చే ప్రధాన అంశాలేవీ లేని నేపథ్యంలో సెప్టెంబర్ నెల డెరివేటివ్‌ల గడువు ముగుస్తూ ఉండడం వచ్చేవారం దేశీ మార్కెట్లను ఆటుపోట్లకు గురి చేయవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే విదేశీ పెట్టుబడుల రాకడ కొనసాగడంలాంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌కు ఊతమిచ్చే అవకాశాలు లేకపోలేదని కూడా వారంటున్నారు. దేశీయంగా ప్రధాన సంఘటనలేవీ లేకపోవడం, డెరివేటివ్‌ల గడువు ముగుస్తూ ఉండడంతో ఈ వారం దేశీయ మార్కెట్లు ఆటుపోట్లలో కొనసాగవచ్చు. సెప్టెంబర్ నెల డెరివేటివ్‌ల గడువు గురువారంతో ముగస్తుందని ట్రేడ్‌స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అభిప్రాయ పడ్డారు. వడ్డీరేట్ల తగ్గింపు అవకాశాల కోసం అక్టోబర్ నెల ప్రారంభంలో జరిగే ఆర్‌బిఐ సమీక్షా సమావేశాన్ని సైతం మార్కెట్లు జాగ్రత్తగా గమనించే అవకాశముందని కొటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్, పిసిజి రిసెర్చ్ విభాగం చీఫ్ దిపేన్ షా అభిప్రాయ పడ్డారు. డాలరుతో రూపాయి కదలికలు, అలాగే ముడి చమురు ధరలు కూడా మదుపరుల దృష్టిలో ఉండవచ్చని కూడా ఆయన అభిప్రాయ పడ్డారు. ఫార్వర్డ్స్, ఆప్షన్ల గడువు కారణంగా మార్కెట్లు ఈ వారం మామూలుకన్నా హెచ్చు ఒడిదుకులకు లోనయ్యే అవకాశముందని క్యాపిటల్‌వయా గ్లోబల్ రిసెర్చ్ వ్యవస్థాపకుడు, సిఇఓ రోహిత్ గాడియా అభిప్రాయ పడ్డారు. క్రితం వారం వరసగా మూడోవారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే. గత వారం సెనె్సక్స్ 69.19 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 51.70 పాయింట్లు లాభపడింది.
నేడు బాండ్లకు పెట్టుబడుల పరిమితిని
వేలం వేయనున్న బిఎస్‌ఇ
ఇదిలావుంటే, రూ.4615 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్ల కొనుగోలుకు విదేశీ ఇనె్వస్టర్లకు పెట్టుబడి పరిమితులను బాంబే స్టాక్ ఎక్స్‌చేంజి బిఎస్‌ఇ సోమవారం వేలం వేయనుంది. సోమవారం మార్కెట్ ట్రేడింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 3.30- 5.30 గంటల మధ్య బిఎస్‌ఇకి చెందిన ‘ఇబిడ్‌ఎక్స్‌చేంజి’ ప్లాట్‌ఫామ్‌పై ఈ వేలం నిర్వహిస్తారు. ఈ డెట్ వేలం కోటాలతో విదేశీ ఇనె్వస్టర్లు తాము ఒనుగోలు చేసిన పరిమితి దాకా వీటిలో పెట్టుబడి పెట్టడానికి హక్కు లభిస్తుంది. ఈ నెల 1 దాకా ప్రభుత్వ బాండ్లలో మొత్తం పెట్టుబడులు 1,36, 954 కోట్లకు చేరుకున్నాయని, ఇది మొత్తం అనుమతించిన పరిమితి 1.44 లక్షల కోట్లలో 95.11 శాతం అని డిపాజిటరీల వద్ద అందుబాటులో ఉన్న గణాంకాలను బట్టి తెలుస్తోంది. కాగా, ఉపయోగించుకోకుండా మిగిలి ఉన్న బాండ్లను ఈ నెల 26న వేలం వేయాలని బిఎస్‌ఇ నిర్ణయించినట్లు ఎక్స్‌చేంజి ఒక సర్క్యులర్‌లో తెలియజేసింది.