బిజినెస్

కొత్తరకం పసుపు ‘పీతాంబర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 26: అంతర్జాతీయంగా పేరుపొందిన హైదరాబాద్‌లోని ‘కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ’ (సిఎస్‌ఐఆర్-ఐఐసిటి) రూపొందించిన ‘సిఐఎం-పీతాంబర్’ అనే కొత్త పసుపు రకాన్ని ప్రధాని నరేంద్రమోదీ సోమవారం విడుదల చేశారు. సిఎస్‌ఐఆర్ నేతృత్వంలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమెటిక్ ల్యాబ్ (హైదరాబాద్) శాస్తవ్రేత్తలు పీతాంబర్‌పై పరిశోధన చేశారు. రైతులకోసం కొత్తరకానికి పీతాంబర్ అనే పేరుపెట్టారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ (సిఎస్‌ఐఆర్) లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక నుండి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని విడుదల చేశారు. హైదరాబాద్‌లోని సిఎస్‌ఐఆర్-ఐఐసిటి లో ఏర్పాటు చేసిన ప్రత్యేక భారీ ఎల్‌సిడి తెరపై మొత్తం కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. ఇక్కడి ఐఐసిటి శాస్తవ్రేత్తలు, రైతులతో ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడారు. కర్నూలుకు చెందిన రైతు గజేందర్ ప్రధానికి తన అనుభవాన్ని తెలియచేస్తూ, తాను జొన్న, మొక్కజొన్న సాగు చేసి నష్టపోయానని, శాస్తవ్రేత్తల సూచనలమేరకు అశ్వగంధ ఔషధ పంటను సాగు చేస్తున్నానని చెప్పారు. ఈ పంట ద్వారా తనకు హెక్టారకు 15 వేల రూపాయల వరకు అదనంగా లాభం వస్తోందన్నారు. కొత్త వంగడాల ద్వారా అధిక దిగుబడులు సాధిస్తామని ఖమ్మం జిల్లా పాడేరుకు చెందిన మరో రైతు ప్రధానికి వివరించారు.
ఐఐసిటిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త రకం పసుపు ‘పీతాంబర్’ విత్తనాన్ని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి పలువురు రైతులకు అందించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ, పీతాంబర్ పసుపురకం తెగుళ్లను తట్టుకునే శక్తి ఉందని, అధిక దిగుబడి వస్తుందని వివరించారు. 180-190 రోజుల్లో పంట పండే పీతాంబర్ దిగుబడి హెక్టారుకు 60-65 టన్నుల వరకు వస్తుందన్నారు. సిఎస్‌ఐఆర్ పరిశోధనా ఫలితాల వల్ల రైతులకు లబ్ది చేకూరుతుందని వివరించారు. నిజామాబాద్ జిల్లాకు ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్లతో ‘స్పైస్‌పార్క్’ను మంజూరు చేసినట్టు గుర్తు చేశారు. స్పైస్‌పార్క్‌లో పసుపు ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఉంటాయన్నారు. రాష్ట్రంలోని 44 మార్కెట్ యార్డులు జాతీయ మార్కెట్‌తో ఎలక్ట్రానిక్ విధానంతో అనుసంధానం జరిగాయని, దీని వల్ల పసుపు రైతులకు అత్యుత్తమ ధర లభిస్తుందని వివరించారు.
ఢిల్లీలోని వేదిక నుండి ప్రధానితో పాటు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు హర్షవర్దన్, వైఎస్ చౌదరి, సిఎస్‌ఐఆర్-ఐఐసిటి డైరెక్టర్ జనరల్ గిరీష్ సహానీ పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఐఐసిటిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఐసిటి శాస్తవ్రేత్త డాక్టర్ బి. నర్సయ్య, ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన శాస్తవ్రేత్తలు డాక్టర్ శైలజ, డాక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.