బిజినెస్

ఈ ఏడాది 20 లక్షల టన్నుల గోధుమల దిగుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా సరఫరాలను మెరుగుపర్చి ధరలను అదుపు చేసేందుకు వీలుగా ధాన్యంపై కస్టమ్స్ సుంకం తగ్గిన తర్వాత 20 లక్షల టన్నుల గోధుమలను దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఫ్లోర్ మిల్లర్లు తెలిపారు. రానున్న నెలల్లో దిగుమతులు పెరిగి దేశీయ మార్కెట్లో ధరలపై వత్తిడి తగ్గుతుందని కేంద్ర ఆహార శాఖ సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ ద్వివేది పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. భారత రోలర్ ఫ్లోర్ మిల్లర్ల సమాఖ్య (ఆర్‌ఎఫ్‌ఎంఎఫ్) వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా సోమవారం ఆయన న్యూఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఫ్లోర్ మిల్లర్ల లాంటి బల్క్ కన్జూమర్లకు ఎఫ్‌సిఐ (్భరత ఆహార సంస్థ) నుంచి జరుగుతున్న గోధుమల అమ్మకాన్ని ప్రభుత్వం నిలిపివేయబోదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఎంత పరిమాణంలో దిగుమతి చేసుకోవాలని భావిస్తోందన్న ప్రశ్నకు ద్వివేది సమాధానమివ్వలేదు. అయితే కస్టమ్స్ సుంకం తగ్గిన తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంరో ప్రభుత్వం విదేశాల్లో 20 లక్షల టన్నుల గోధుమలను కొనుగోలు చేస్తుందని అంచనా వేస్తున్నట్టు మిల్లర్లు తెలిపారు.