బిజినెస్

బందరులో మెరైన్ బిజినెస్‌కు దుబాయ్ సంస్థ ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 26: కృష్ణా జిల్లాలో బందరు ఓడరేవు నిర్మాణం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండటంతో ఈ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించేందుకు విదేశీయులు ఆసక్తి చూపుతున్నారు. దుబాయ్‌కు చెందిన ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీ బందరులో మెరైన్ బిజినెస్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈమేరకు సోమవారం రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు, ‘మడ’ వైస్ చైర్మన్ గంధం చంద్రుడును ఆర్ అండ్ బి అతిథిగృహంలో కలిశారు. ఘంటూట్ షిప్ బిల్డింగ్ ఎల్‌ఎల్‌సి మేనేజింగ్ కన్సల్టెంట్ రాజీవ్ వోహ్ర తమ సంస్థ చేపట్టే ప్రాజెక్టుల గురించి వారికి వివరించారు. మంగినపూడి బీచ్‌లో రూ.300 కోట్లతో పలు పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దీనికోసం 30 ఎకరాల స్థలం కావాలని వారు కోరారు.

చిత్రం.. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపి కొనకళ్ళ నారాయణతో
చర్చిస్తున్న దుబాయ్ ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులు