బిజినెస్

పాడి పశువుల బీమాతో రైతన్నకు ధీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 1: వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయం ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్న సమయంలో సేద్యంపైనే ఆధారపడే రైతన్నలు పశువుల పెంపకంతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. పాల విక్రయం ద్వారా నాలుగు మెతుకులు తినగలుగుతున్నారు. అయితే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు వ్యవసాయంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నదాతలు పశువుల అకాల మరణాలతో మరింత నష్టాల పాలవుతున్నారు. దీంతో రైతు కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నాయి. ఈ క్రమంలోనే పశువుల పెంపకందార్లకు ఆర్థిక చేయూతనివ్వడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. పాడి పశువుల (లైవ్ స్టాక్) బీమా పథకాన్ని అమలుచేస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. పాడి పశువుల బీమా పథకాన్ని తొలుత దేశంలో 100 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. 2010 నుంచి దేశమంతటా ఈ పథకాన్ని శాశ్వత స్థాయిలో అమలు చేస్తున్నారు. పాడి పశువుల బీమా పథకాన్ని రెండు ఆశయాలను దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్నారు. పాడి పశువులు మృత్యువాత పడితే కలిగే నష్టం నుంచి రైతులకు, పాడి పశువుల పెంపకందార్లకు తగిన రక్షణ కల్పించడం ప్రధానమైనది. పాడి పశువులకు బీమా చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాన్ని ప్రజలకు ప్రత్యక్షంగా చూపించి తద్వారా పాడి పశువులు, వాటి ఉత్పత్తులు నాణ్యంగా ఉండేలా చూడడం రెండోది. ఈ పథకం కింద ఆవులు, గేదెలకు గరిష్ఠ ధరకు బీమా చేసే సదుపాయం కల్పించారు. చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తంలో 50 శాతం సబ్సిడీగా ఇస్తారు. సబ్సిడీ రూపంలో అయ్యే మొత్తం ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. గోవా మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ఆయా రాష్ట్ర పాడి పశువుల అభివృద్ధి బోర్డుల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
బీమా ప్రక్రియ విషయానికొస్తే ఈనిన తర్వాత నుంచి వట్టిపోయే వరకూ పాలిచ్చే కాలానికి (లాక్టేషన్), కనీసం 1,500 లీటర్ల పాలిచ్చే గేదెలు, ఆవులనన్నింటినీ అధిక దిగుబడి పాడి పశువులుగా పరిగణిస్తారు. ఈ పథకం కింద వాటిని మార్కెట్‌లో అప్పటి గరిష్ఠ ధరకు బీమా చేయవచ్చు. అయతే మరే బీమా పథకమూ వర్తించదు. ఒక్కో లబ్ధిదారు రెండు పాడి పశువులకు మించకుండా సబ్సిడీ సదుపాయాన్ని పొందవచ్చు. గరిష్ఠంగా మూడేళ్లకు మించని బీమా పాలసీలకే సబ్సిడీ సదుపాయం వర్తిస్తుంది. మూడేళ్ల పాలసీ తీసుకునేలా రైతులను ప్రోత్సహించాలి. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది. తుపానులు, కరవు వంటి ప్రకృతి వైపరీత్యాల్లో అసలైన ప్రయోజనం పొందడానికి వీలవుతుంది. అయితే ఏవైనా సహేతుకమైన కారణాల దృష్ట్యా పాడి పశువుల యజమానులైనవారైనా మూడేళ్ల కంటే తక్కువ కాలానికి పాలసీ తీసుకోవాలనుకుంటే కూడా వారికి ఈ పథకం కింద సబ్సడీ సదుపాయాన్ని వర్తింపజేస్తారు. కాని ఆ తర్వాత పాలసీ కాలపరిమితి పొడిగింపునకు సబ్సిడీ పొందే అవకాశం వారికి ఉండదు.
పాడి పశువులను మార్కెట్‌లో అప్పటి గరిష్ఠ ధరకు బీమా చేస్తారు. ఈ ధరను లబ్ధిదారు, గుర్తింపు పొందిన పశు వైద్యుడు, ఇన్స్యూరెన్స్ ఏజెంట్ కలిసి నిర్ణయిస్తారు. బీమా సొమ్ము చెల్లించాలంటే బీమా చేసిన పాడి పశువు అదేనని సక్రమంగా, నిర్దిష్టంగా గుర్తించడం అవసరం. అందువల్ల అలాంటి పశువు చెవికి ఒక గుర్తింపు పట్టీ (టాగ్) తగిలించడం వున్నంతలో ఆధారపడదగిన మంచి పద్ధతి. బీమా చేసే సమయంలో సంప్రదాయకంగా చెవికి పట్టీవేయడం గాని, ఆధునిక పరిజ్ఞానంతో మైక్రో చిప్ అమర్చడం గాని చేయాల్సి ఉంటుంది. గుర్తింపు పట్టీ, చిప్‌కు అయ్యే ఖర్చును బీమా కంపెనీయే భరిస్తుంది. దాన్ని జాగ్రత్తగా కాపాడవలసిన బాధ్యత మాత్రం లబ్ధిదారులదే. ఎలాంటి గుర్తింపు పద్ధతిని అనుసరించాలి, దాని నాణ్యత ఎలా ఉండాలనేది లబ్ధిదారులు, బీమా సంస్థ పరస్పర అంగీకారంతో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. బీమా పాలసీ అమలులో ఉండగానే ఆ పాడి పశువును అమ్మడం గాని, మరొకరికి అప్పగించడం గాని జరిగే సందర్భంలో పాలసీ పూర్తయ్యే గడువులో మిగతా కాలానికి, లబ్ధిదారుకు ఉండే అధికారాన్ని ఆ పాడి పశువు కొత్త యజమానికి బదలాయించాల్సి ఉంటుంది. అందువల్ల బీమా పాలసీని మరొకరి పేర బదలాయించాల్సి వస్తే అనుసరించాల్సిన పద్ధతులు, ఫీజు, విక్రయ పత్రం (సేల్ డీడ్) మొదలైన విషయాలను గురించి బీమా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకునే ముందే ఒక నిర్ణయానికి రావాలి.
ఇక క్లెయిమ్ చెల్లించవలసి వచ్చిన సందర్భంలో అవసరమైన పత్రాలను అందజేసిన 15రోజుల్లోగా (వీలున్నంతవరకు) బీమా మొత్తాన్ని సంస్థలు చెల్లిస్తాయ. పాడి పశువుకు బీమా చేసే సమయంలో, క్లెయిముల పరిష్కారానికి అనుసరించవలసిన నిర్దిష్టమైన పద్ధతులను స్పష్టంగా పేర్కొనడం, క్లెయిమ్ కోసం అందజేయవలసిన పత్రాల జాబితాను రూపొందించడం, పాలసీ పత్రంతోపాటు ఆ వివరాలను లబ్ధిదారుకు అందించడంలో సిఇఒలు శ్రద్ధ వహిస్తున్నారు.