బిజినెస్

ఆంధ్రాలో కొత్త గోదాంలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున గోదాంల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడి లేక్‌వ్యూ అతిథి గృహంలో పాత్రికేయులతో మాట్లాడుతూ గోదాంలతోపాటు ఆక్వా కోల్డ్ స్టోరేజీలు, మిర్చి, పసుపు కోల్డ్ స్టోరేజీలు కూడా నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామ ని పేర్కొన్నారు. విశాఖపట్టణం, భీమవరంలో ఆక్వా ప్రాసెసింగ్ అండ్ కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి 85.55 కోట్లు, గుంటూరు స్పైసెస్ పార్కులో మిర్చి, పసుపు ప్రాసెసింగ్ అండ్ కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి 37.4 కోట్లతో ప్రణాళికలను సిద్ధం చేశామని ప్రసాద్ తెలిపారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వాణిజ్య శాఖకు సమర్పించామని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం 44 కోట్ల రూపాయలను గ్రాంట్‌గా ఇవ్వడానికి నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారని ప్రసాద్ తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఈ ప్రాజెక్టులను నిర్మించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.