బిజినెస్

అభివృద్ధి దిశగా తెలంగాణ పరుగులు: కెటిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: కొత్త రాష్ట్రానికి సహజంగా అనేక సవాళ్లు ఎదురవుతాయని, అయతే వాటిని విజయవంతంగా ఎదుర్కొని నిలిచామని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. ఐఎస్‌బి, భారత విదేశాంగ శాఖ సంయుక్తంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో కెటిఆర్ మాట్లాడారు. తెలంగాణ విజన్, సవాళ్లను ఎదుర్కొన్న తీరు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు వస్తున్న విధానం, మానవ వనరుల అభివృద్ధి, శిక్షణ వంటి రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని ఈ సమావేశంలో కెటిఆర్ ప్రస్తావించారు.