బిజినెస్

దేశ, విదేశీ ప్రయాణికులకు ఎయిర్ ఏషియా డిస్కౌంట్ ఆఫర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: మలేషియాకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా దేశ, విదేశీ ప్రయాణికుల కోసం సోమవారం పలు రాయితీలను ప్రకటించింది. ఎయిర్ ఏషియా ఇండియాతోపాటు వివిధ దేశాల్లో నడుస్తున్న తమ విమానాల్లో ప్రయాణించేవారికి ఈ రాయితీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. సోమవారం నుంచి ఈ నెల 16 వరకు టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి రాయితీ సౌకర్యం అందుబాటులో ఉంటుందని, మంగళవారం నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 27 వరకు ఇది చెల్లుబాటు అవుతుందని ఓ ప్రకటనలో ఏయిర్ ఏషియా తెలియజేసింది. ఎయిర్ ఏషియా ఇండియా విమానాల రాకపోకలు జరిగే బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్, న్యూఢిల్లీ, పుణె, గౌహతి, జైపూర్, ఇంఫాల్ తదితర దేశీయ నగరాలకు వన్‌వే టిక్కెట్ ధర 999 రూపాయల (అన్ని పన్నులతోసహా) నుంచి మొదలవుతుందని ఎయిర్ ఏషియా తెలిపింది. అలాగే కౌలాలంపూర్, బ్యాంకాక్, సింగపూర్, బాలీ, ఫుకెట్, మెల్‌బోర్న్, సిడ్నీ తదితర అంతర్జాతీయ నగరాలకు వెళ్లే ప్రయాణికుల కోసం 3,599 రూపాయల నుంచే టిక్కెట్ ధరలుంటాయని పేర్కొంది. ఎయిర్ ఏషియా, టాటా సన్స్ జాయింట్ వెంచరైన ఎయిర్ ఏషియా ఇండియా.. బెంగళూరు, న్యూఢిల్లీ కేంద్రంగా దేశంలోని 11 ప్రాంతాలకు విమాన సేవలను అందిస్తోంది. చంఢీగఢ్, జైపూర్, గౌహతి, ఇంఫాల్, పుణె, గోవా, వైజాగ్, కొచ్చి, హైదరాబాద్ నగరాలకు ఏయిర్ ఏషియా ఇండియా విమానాలు నడుస్తున్నాయి. ఎయిర్ ఏషియా మలేషియా, ఎయిర్ ఏషియా థాయిలాండ్, ఎయిర్ ఏషియా ఇండోనేషియా, ఎయిర్ ఏషియా ఫిలిప్పిన్స్, మలేషియా ఎయిర్ ఏషియా ఎక్స్, థాయ్ ఎయిర్ ఏషియా ఎక్స్ సర్వీసులకు ఈ రాయితీ టిక్కెట్లు చెల్లుబాటు అవుతాయి.
ఎయర్ కోస్టాకు దేశవ్యాప్త లైసెన్సు
మరోవైపు ఆంధ్రాకు చెందిన ఎయర్ కోస్టాకు దేశవ్యా ప్తంగా విమాన సర్వీసులను నడిపేందుకు కావాల్సిన లెసెన్సు వచ్చింది. ఈ మేరకు డిజిసిఎ నుంచి లైసెన్సు అందుకున్నట్లు సోమవారం ఎయర్ కోస్టా తెలిపింది.