బిజినెస్

పొగాకు నియంత్రణ సదస్సులో మాకూ చోటివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: వచ్చే నెల 7 నుంచి 12వ తేదీ వరకు ఢిల్లీలో జరిగి అంతర్జాతీయ పొగాకు నియంత్రణ సదస్సుకు అఖిల భారత బీడీ పరిశ్రమ సమాఖ్య ప్రతినిధులను కూడా ఆహ్వానించాలని సమాఖ్య అధ్యక్షుడు రజనీకాంత్ పి.పటేల్ కేంద్రాన్ని కోరారు. దేశంలో లక్షలాది మంది బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ సదస్సులో పొగాకుపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. దేశంలో మిలియన్ల మంది బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నారన్నారు. బీడీ యూనియన్లను కూడా ఈ సదస్సు నిర్ణయాలు, తీర్మానంలో భాగస్వాములను చేయాలన్నారు. పొగాకు నియంత్రణ సదస్సు పారదర్శకంగా జరగాలన్నారు. ఏకపక్ష నిర్ణయాల వల్ల పొగాకు రైతులు, పొగాకు ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్న ప్రజల సామాజిక, ఆర్థిక స్ధితి గతులపై పెను ప్రభావం పడుతుందన్నారు. కొన్ని ఎన్‌జివోలు, పొగాకు వ్యతిరేక సంస్ధలు పొగాకు పరిశ్రమను దెబ్బతీసేందుకు పలుకుబడి ఉపయోగిస్తున్నారని, దీని వల్ల సమాజంలో తీవ్రపరిణామాలు నెలకొంటాయని ఆయన హెచ్చరించారు.