బిజినెస్

రెండో రోజూ నష్టాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 6: యూరోపియన్ యూనియన్‌నుంచి బ్రిటన్ వైదొలగడంపై ఆందోళన కొనసాగుతుండడం, అలాగే ఇటీవలి కాలంలో రాణించిన కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణలాంటి కారణాల వల్ల వరసగా రెండో రోజు కూడా దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఫలితంగా బుధవారం 114 పాయింట్లు కోల్పోయిన బిఎస్‌ఇ సెనె్సక్స్, గురువారం కూడా మరో 115 పాయింట్ల దాకా నష్టపోయింది. రియల్టీ, విద్యుత్, బ్యాంకింగ్ రంగాలకు చెందిన షేర్లు ప్రదానంగా నష్టపోయాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ముగియగా, ఐరోపా మార్కెట్లు మాత్రం నష్టాలతో ప్రారంభమైనాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోందన్న సంకేతాల కారణంగా వచ్చే డిసెంబర్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న భయంతో యూరోపా మార్కెట్లు నష్టపోయాయి. అయితే ఆసియా మార్కెట్లు లాభాలతో ముగియడం గమనార్హం. ఫలితంగా బిఎస్‌ఇ సెనె్సక్స్ 114.77 పాయింట్లు నష్టపోయి 28,106.21 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 34.40 పాయింట్లు నష్టపోయి 8,709.55 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్‌లోని కంపెనీల్లో ఎన్‌టిపిసి 2.42 శాతం నష్టపోగా. సిప్లా 2.30 శాతం నష్టపోయింది. మహింద్ర, మహింద్ర, పవర్ గ్రిడ్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బిఐ, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్‌లాంటి షేర్లు కూడా నష్టపోయాయి. సెనె్సక్స్‌లోని మొత్తం 30 కంపెనీల షేర్లలో 22 షేర్లు న్టపోగా, 8 మాత్రమే లాభపడ్డాయి. లావాదేవీల చివర్లో రియల్టీ, విద్యుత్, హెల్త్‌కేర్, ఐటి రంగాల షేర్లలో లాభాల స్వీకరణకు మదుపరులు ఎగబడ్డారు. ఫలితంగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సైతం నష్టపోయాయి.
ఎన్‌ఎస్‌ఇ ఐపిఓకు బోర్డు ఆమోదం
ఇదిలా ఉండగా షేర్ల విక్రయానికి ఆఫర్ మార్గంలో ఐపిఓకు వెల్లడానికి జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి(ఎన్‌ఎస్‌ఇ) కి బోర్డు ఆమోదం లభించింది. ఐపిఓకు సంబంధించిన పత్రాలను ఎన్‌ఎస్‌ఇ వచ్చే ఏడాది జనవరిలో మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెబికి సమర్పిస్తుంది. ఓవర్సీస్ లిస్టింగ్ కోసం కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పత్రాలను సెబికి దాఖలు చేస్తుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఎన్‌ఎస్‌ఇ ఇప్పటికే ఒక లిస్టింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడున్న వాటాదారులకు షేర్ల విక్రయం రూపంలో ఈ ఐపిఓ ఉంటుంది. ఇదే కాకుండా 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రతి షేరుకు రూ. 79.50ల మధ్యంతర డివిడెండ్ చెల్లించడానికి కూడా ఈ నెల 4న జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయించారు. షేర్‌హోల్డర్ల దగ్గరున్న ప్రతి పది షేర్లకు ఒక అదనపు షేరును విక్రయించాలని కూడా బోర్డు నిర్ణయించింది.