బిజినెస్

సింగరేణిని ప్రగతిపథంలో నడుపుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: కార్మికుల సమష్టి కృషితో సింగరేణి సంస్థ లాభాల బాటలో నడుస్తోందని, ఇదే స్ఫూర్తితో సంస్థను ప్రగతిపథంలో నడుపుదామని సింగరేణి (కోల్ మూవ్‌మెంట్) సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గత ఆర్థిక సంవత్సరం (2015-16) సింగరేణికి వచ్చిన 1066.13 కోట్ల రూపాయల నికర లాభాల్లో 23 శాతాన్ని వాటాగా ఉద్యోగులకు చెల్లించామని ఆయన తెలిపారు. శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి చరిత్రలోనే ఎక్కువ మొత్తాన్ని స్పెషల్ ఇన్‌సెంటివ్‌గా చెల్లించడం జరుగుతోందన్నారు. సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ్ధర్ నేతృత్వంలో సంస్థ మరింతగా అభివృద్ధి చెందగలదన్న విశ్వాసాన్ని కనబరిచారు. కాగా, 2015-16లో రికార్డు స్థాయిలో 15 శాతం వృద్ధిరేటుతో 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడం వల్లే అధిక లాభాలు గడించామన్నారు. అయతే ఈసారి కోల్ బెల్ట్ వ్యాప్తంగా వర్షాలు అధికంగా కురవడంతో ఉత్పత్తిలో కొంత వెనుకబడి ఉన్నామన్నారు. అయనప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మిగిలిన కాలంలో ఈ లోటును పూడ్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. అలాగే బొగ్గు నాణ్యత పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన సూచించారు. సింగరేణి జనరల్ మేనేజర్ (కో-ఆర్డినేషన్) నాగయ్య మాట్లాడుతూ ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తూ మరిన్ని లాభాలు గడిస్తే.. తద్వారా మరిన్ని సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు, ఎక్కువ బోనస్ పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు.