బిజినెస్

గట్టెక్కించిన ఆర్‌బిఐ నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 8: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 195.18 పాయింట్లు పుంజుకుని 28,061.14 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 86.45 పాయింట్లు అందిపుచ్చుకుని 8,697.60 వద్ద నిలిచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నూతన గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన తొలి ద్రవ్యసమీక్షలోనే ఆశ్చర్యకరంగా కీలక వడ్డీరేట్లను పావు శాతం చొప్పున తగ్గించడం మదుపరులను ఆకట్టుకుంది. రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను ఈ నెల 4న నిర్వహించిన సమీక్షలో 25 బేసిస్ పాయింట్ల మేరకు ఆర్‌బిఐ తగ్గించింది. ఇది మార్కెట్లను ఉత్సాహపరచగా, వృద్ధిరేటు విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) పురోగమన అంచనాలు, వరుసగా తొమ్మిదో నెల ఉత్పాదక రంగ పిఎమ్‌ఐ ఆశాజనకంగా ఉండటం వంటివి మార్కెట్ల లాభాలకు దోహదపడ్డాయి.
ఇకపోతే గడచిన వారంలో తొలి రెండు రోజులైన సోమ, మంగళవారాల్లో స్టాక్ మార్కెట్లు లాభాలను అందుకున్నాయి. ఆ తర్వాత మూడు రోజులు మాత్రం నష్టాలకే పరిమితమయ్యాయి. అయినప్పటికీ సోమవారం నమోదైన భారీ లాభాలతో గట్టెక్కగలిగాయి. నిజానికి అంతకుముందు వారం భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తకర పరిస్థితుల మధ్య సెనె్సక్స్ 802.26 పాయింట్లు, నిఫ్టీ 220.40 పాయింట్లు పతనమయ్యాయి. ఈ పరిస్థితిలో ఆర్‌బిఐ ద్రవ్యసమీక్షపై ఆశావాహ దృక్పథం, అందుకు తగ్గట్లే వడ్డీరేట్ల తగ్గింపు మార్కెట్లను కాపాడాయి. ఇక చమురు, గ్యాస్, మెటల్, రియల్టీ, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటి, టెక్నాలజీ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. స్మాల్-క్యాప్ 3.46 శాతం, మిడ్-క్యాప్ 2.86 శాతం చొప్పున లాభపడ్డాయి. టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 19,026.44 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 18,280.84 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 1,05,549.39 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 1,27,819.04 కోట్ల రూపాయలుగా ఉంది