బిజినెస్

బాండ్ల జారీ ద్వారా రూ.4,400 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: ప్రభుత్వ రంగంలోని ప్రముఖ సంస్థల్లో ఒకటైన ఎన్‌హెచ్‌పిసి లిమిటెడ్ ప్రైవేట్ ప్లేస్‌మెంట్ పద్ధతిలో బాండ్లను జారీ చేయడం ద్వారా రానున్న ఏడాది కాలంలో 4,500 కోట్ల రూపాయల నిధులను సమీకరించుకునేందుకు వాటాదారుల నుంచి అనుమతి పొందింది. సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్, రీడీమబుల్, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు/బాండ్ల జారీ ద్వారా ఈ నిధులను సమీకరించుకునేందుకు గత నెల 22వ తేదీన జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో తమ వాటాదారులు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించారని ఎన్‌హెచ్‌పిసి లిమిటెడ్ ఒక ప్రకటనలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజికి తెలియజేసింది. తీర్మానాన్ని ఆమోదించిన నాటి నుంచి ఏడాది కాలంలోగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో బాండ్లను జారీ చేయడం ద్వారా ఈ నిధులను సమకూర్చుకోనున్నట్లు ఎన్‌హెచ్‌పిసి లిమిటెడ్ ఆ ప్రకటనలో పేర్కొంది. కేంద్ర విద్యుత్ శాఖ ఆధీనంలో పనిచేస్తున్న ఎన్‌హెచ్‌పిసి లిమిటెడ్ సాంప్రదాయ, సాంప్రదాయేతర వనరుల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలో 23,404 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసిన ఎన్‌హెచ్‌పిసి రూ.7,347 కోట్ల అమ్మకాలతో రూ.2,240 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.