బిజినెస్

మార్కెట్లు ఢమాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 13: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న ఊహాగానాలతో పాటుగా చైనా వృద్ధి వేగం మందగించడం లాంటి పలు అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కుప్పకూలాయి. దీనికి తోడు గురువారం సాయత్రం రిటైల్ ద్రవ్యోల్బణం డేటా ప్రకటించనుండడంతో మదుపరులు లాభాల స్వీకరణకే మొగ్గు చూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభంనుంచే నష్టాల్లో కొనసాగాయి. ఒక దశలో బిఎస్‌ఇ సెనె్సక్స్ 500 పాయింట్లకు పైగా పడిపోయింది. అయితే చివరికి 439 పాయింట్లు కోల్పోయి మూడు నెలల కనిష్టస్థాయి అయిన 27,643.11 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 8,600 పాయింట్ల దిగువకు పడిపోయి 135.45 పాయింట్ల నష్టంతో 8,573.35 పాయింట్ల వద్ద ముగిసింది. రెండు రోజుల సెలవుల అనంతరం మార్కెట్లు అంతర్జాతీయ ప్రభావాల కారణంగా తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయని నిపుణులు అంటున్నారు. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న భయాలు, ఐరోపా కూటమినుంచి బ్రిటన్ వైదొలగడం ఐరోపా మార్కెట్లపై ప్రభావం చూపించవచ్చన్న భయాలకు తోడు, చైనా వృద్ధి రేటు మందగించడం లాంటి పలు అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపించాయని వారంటున్నారు. దీనికి తోడు ఆగస్టు నెల పారిశ్రామిక వృద్ధి గణాంకాలు నిరాశాజనకంగా ఉండడంతో పాటు కీలక కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెలువడనుండడంతో మదుపరులు ఆచితూచి వ్యవహరించడం కూడా మార్కెట్ పతనానికి కారణంగా మార్కెట్ వర్గాలు విశే్లషిస్తున్నాయి. గత నెల 21-22 తేదీల్లో జరిగిన అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశంలోనే భవిష్యత్తులో వడ్డీ రేట్లను పెంచుతామన్న బలమైన సంకేతాలను ఇచ్చారు. ఫెడ్ విధానకర్తల్లో చాలా మంది ఇప్పటికే వడ్డీ రేట్ల పెంపును అనుకూలంగా ఉన్న నేపథ్యంలో డిసెంబర్‌లో వడ్డీ రేట్లను పెంచడం తప్పదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు చైనా ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే పది శాతానికి పైగా తగ్గిపోయాయి. మరోవైపు ఆగస్టులో పెరిగిన దిగుమతులు సైతం సెప్టెంబర్ నెలలో 1.9 శాతానికి పడిపోవడంతో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలో ఆర్థిక స్థిరీకరణ మూడునాళ్ల ముచ్చటేనన్నదానికి ఇవి సంకేతాలనిపిస్తోంది. సెనె్సక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 24 షేర్లు భారీ నష్టాలను చవి చూశాయి. రంగాల వారీగా చూసినట్లయితే బ్యాంకింగ్, రియల్టీ రంగాల సూచీలు 2 శాతానికి పైగా పడి పోగా, ఐటి సూచీ మాత్రం స్వల్పంగా పెరిగింది. గురువారం వెలువడనున్న ఐటి సేవల దిగ్గజం టిసిఎస్ త్రైమాసిక ఫలితాలు అంచనాల మేరకు ఉండకపోవచ్చన్న వార్తల కారణంగా ఆ కంపెనీ షేరు 2 శాతానికి పైగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రధాన ఆసియా మార్కెట్ల సూచీలన్నీ కూడా భారీ నష్టాలతో ముగియగా, ఐరోపా మార్కెట్లు కూడా ప్రారంభంలోనే నష్టాల్లో ట్రేడయ్యాయి.