బిజినెస్

సంస్కరణలే శ్రీరామరక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 13: ఆర్థిక కార్యకలాపాల వేగాన్ని పెంపొందించి దేశంలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం విధానపరమైన తోడ్పాటును అందిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితుల వలన భారత ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి దుష్ప్రభావం పడకుండా చూసేందుకు దేశీయంగా చేపడుతున్న సంస్కరణలు దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. గోవాలో శుక్రవారం ప్రారంభమయ్యే బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల శిఖరాగ్ర సమావేశానికి ముందు గురువారం ముంబయిలో నిర్వహించిన బ్రిక్స్ పెట్టుబడుల సదస్సులో జైట్లీ ప్రసంగిస్తూ, కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అర్హమైన దాదాపు 90 శాతం రంగాల్లో ఎఫ్‌డిఐలను ఆటోమ్యాటిక్ మార్గంలో ఉంచిందన్నారు. ‘గత రెండున్నరేళ్లలో మేము అనేక రంగాల పనితీరును సమీక్షించి ప్రపంచంలోనే అత్యంత సరళమైన ఎఫ్‌డిఐ విధానాన్ని అనుసరిస్తున్నాం. దీంతో 90 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆటోమ్యాటిక్ మార్గం ద్వారా వస్తున్నాయి’ అని జైట్లీ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేసే ప్రక్రియ గణనీయంగా మెరుగుపడిందని, అనేక రంగాలను ఆటోమ్యాటిక్ మార్గంలోకి తీసుకురావడంతో ప్రస్తుతం విదేశీ పెట్టుబడుల అభివృద్ధి బోర్డు (ఎఫ్‌ఐపిబి) ఎదుట నిరవధిక పెండింగ్ కేసులేవీ లేవని ఆయన తెలిపారు.
ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్స్ ఈ ఏడాది భారత్ ర్యాంకు 39వ స్థానానికి మెరుగుపడిన విషయాన్ని జైట్లీ ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం విధానపరంగా చేపట్టిన పలు సంస్కరణలు దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు ఎంతగానో దోహదపడ్డాయన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న విధాన పరమైన చర్యలన్నీ దేశంలో ఆర్థిక కార్యకలాపాల వేగాన్ని పెంపొందించి పెట్టుబడులకు భారత్‌ను ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ఏకైక లక్ష్యంతో కూడుకున్నవేనని ఆయన స్పష్టం చేశారు. వ్యాపారాన్ని సులభతరం చేయడంతో పాటు ప్రపంచ పోటీతత్వ ర్యాంకుల్లో భారత్ స్థానం గత రెండున్నరేళ్లలో ఎంతో మెరుగపడిందని, ఇందుకు మోదీ ప్రభుత్వ నిర్ణయాలు, విధాన పరమైన చర్యలు ఎంతగానో ఉపకరించాయని ఆయన అన్నారు. అలాగే వ్యాపారం విషయంలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వం నెలకొనడం అభినందనీయమని జైట్లీ పేర్కొంటూ, దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది కూడా ఎంతగానో దోహదం చేస్తోందన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య సహకారం గత కొనే్నళ్లలో ఎంతో మెరుగుపడినప్పటికీ, దీనిని మరింత పెంపొందించుకునేందుకు ఇంకా అవకాశం ఉందని, కనుక బ్రిక్స్ సభ్య దేశాలన్నీ తరచుగా సమావేశమై సహకారాన్ని విస్తరించుకోవడంపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని జైట్లీ ఉద్ఘాటించారు.
ఇదిలావుంటే, పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థల్లో, ప్రత్యేకించి ప్రపంచంలోనే అతిపెద్దదైన అమెరికా ఆర్థిక వ్యవస్థలో రక్షణాత్మక ధోరణులు పెరుగుతుండటం పట్ల జైట్లీ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ సాధారణ విధానాలను అవలంబిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

చిత్రం.. ముంబయలో గురువారం బ్రిక్స్ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ (ఎడమ), సెబీ చైర్మన్ యుకె.సిన్హా (కుడి)