బిజినెస్

అన్నివిధాలా సహకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: చైనా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో మద్దతు పలకబోతోంది. ప్రపంచ మొబైల్ మార్కెట్‌లో దూసుకెళ్తున్న భారత్‌లో చైనా సంస్థలు మొబైల్ తయారీ కేంద్రాలను నెలకొల్పాలనుకుంటున్నాయి. దేశీయ మార్కెట్‌లో చైనా మొబైల్ సంస్థలు ఇప్పటికే అమ్మకాలపరంగా దూకుడును ప్రదర్శిస్తున్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి జరిగే దిగుమతులు భారమవుతున్న క్రమంలో భారత్‌లోనే చైనా సంస్థలు తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని చూస్తుండగా, అదే జరిగితే అన్ని సదుపాయాలను కల్పిస్తామని కేంద్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ (ఎమ్‌ఇఐటివై) కార్యదర్శి అరుణా సుందరరాజన్ అన్నారు. శనివారం ఇక్కడ జరిగిన రెండవ ‘్భరత్-చైనా మొబైల్ ఫోన్, యాక్ససరీస్ తయారీ సదస్సు’కు హాజరైన ఆమె మాట్లాడుతూ భారత్‌లో తయారు చేయడానికి వచ్చేవారెవరికైనా సహకరిస్తామన్నారు. ప్రస్తుతం భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్ విలువ 280 మిలియన్ డాలర్లు అని తెలిపారు. ఎమ్‌ఇఐటివై జాయింట్ డైరెక్టర్ మీనాక్షి రాయ్ భాటియా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో దాదాపు 7 వేల ఎకరాల స్థలం తయారీ రంగం కోసం సిద్ధంగా ఉందన్నారు. భారతీయ సెల్యులార్ అసోసియేషన్ (ఐసిఎ) మాట్లాడుతూ దేశంలో మొబైల్ తయారీ రంగం వృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని స్వాగతిస్తున్నామంది. అయితే చైనాలో కూడా భారతీయ సంస్థలు ఇదే తరహా అవకాశాలను కల్పించాలంది.

చిత్రం.. సదస్సులో ప్రదర్శించిన మొబైల్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు