బిజినెస్

కర్నూలులో సోలార్ సెల్స్ తయారీ పరిశ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 24: కర్నూలు జిల్లాలో సోలార్ సెల్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు బ్రిటన్‌లోని భారతీయ కంపెనీ ‘సోలార్ జిస్ ఇండియా’ ముందుకొచ్చింది. అలాగే అనంతపురం జిల్లాలో సోలార్ పార్క్ నిర్మాణానికీ సంస్థ సంసిద్ధత తెలుపుతూ ప్రతిపాదనలు సమర్పించింది. కంపెనీ ప్రతినిధులు సోమవారం సాయంత్రం సిఎంవోలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ పరిశ్రమల స్థాపనకు కంపెనీ ఇప్పటికే ఈడిబి, నెడ్‌క్యాప్‌తో అవగాహనకు వచ్చింది. కర్నూలు జిల్లాలో సోలార్ సెల్స్ తయారీ కర్మాగారం, అనంతపురంలో సోలార్ పార్కు నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు సోలార్ జిస్ ఇండియా తెలియజేసింది. భూమి కేటాయించిన పక్షంలో రెండేళ్లలో ప్లాంటు నిర్మించి ఉత్పత్తి ప్రారంభిస్తామని సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇదిలావుంటే కర్నూలు జిల్లాలో లభించే సిలికా సోలార్ సెల్స్ తయారీకి అత్యంత అనుకూలమైన ముడి పదార్థమని పరిశోధనల్లో తేలింది. కర్నూలు ప్లాంటు ఏర్పాటుకు 5 వందల ఎకరాల స్థలం అవసరమని ప్రతినిధులు సిఎంకు వివరించారు. కాగా, అనంతపురం జిల్లాలో 8 వేల ఎకరాల్లో సోలార్ పార్క్ ఏర్పాటు చేస్తామని సోలార్ జిస్ ఇండియా ప్రతిపాదించింది. ఈ ప్లాంట్‌తో 4 వేల మందికి ప్రత్యక్షంగా, 10 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందని వారు ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో కావలసిన అన్ని అనుమతులను 2 వారాల్లో ఇస్తున్నామని చంద్రబాబు వారికి తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన స్థలం కేటాయింపు, అనుమతులపై సమన్వయం చేసుకోవాలని ఇంధన శాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఇడిబి) సీఈఓ జాస్తి కృష్ణకిశోర్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, నెడ్‌క్యాప్ ఎండీ కమలాకర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.