బిజినెస్

పారిశ్రామికవేత్తల సమస్యలకు నెల రోజుల్లో పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం అక్టోబర్ 27: కొర్రీలతో పెండింగ్‌లోనున్న పరిశ్రమలకు, గత ఏడాది జనవరిలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో ఎంఒయు చేసుకున్న పరిశ్రమల స్థాపనకు సంబంధించిన సమస్యలను నెల రోజుల్లో పరిష్కరిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ తెలిపారు. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సిఎస్ టక్కర్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రెండేళ్ళల్లో ఆంధ్రప్రదేశ్‌కు పలు పరిశ్రమలు, ఐటి సంస్థలు, ఫార్మాస్యూటికల్స్, ఎన్నారై కంపెనీలు రానున్నాయని, దీంతో రాష్ట్రం 15 శాతం వృద్ధిని సాధిస్తుందని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఉన్నంతంగా ఉంటుందన్నారు. వచ్చే ఏడాది మార్చిలోపు లక్షా 50 వేల ఉద్యోగాలు కల్పించనున్నామన్నారు. పరిశ్రమల స్థాపనకు విశాఖపట్నం అనువుగా ఉందని, వౌలిక వసతులు మెరుగపర్చాల్సి ఉందని, తదుపరి స్థానం విజయనగరందేనన్నారు. విజయనగరం జిల్లాలో అంతర్జాతీయ విమానాశ్రయం రానున్నందున, ప పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం విజయనగరం జిల్లాకు ఉందన్నారు. ఈ సందర్భంగా పలు పారిశ్రామికవేత్తలు భూ సంబంధ సమస్యలు, విద్యుత్ సమస్యలు, అగ్నిమాపక శాఖ నుండి ఎన్‌ఓసి సమస్యలు, కాలుష్య నియంత్రణశాఖ, కార్మిక, సేల్స్‌టాక్స్ శాఖల నుండి ఎదురవుతున్న సమస్యలను సిఎస్‌కు వివరించారు. ప్రతి సమస్యకు సంబంధిత అధికారి నుండి వివరణ అడిగి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. వచ్చే జనవరి 27 నుండి 29 వరకు మూడు రోజులపాటు విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు నిర్వహించనున్నామని, ఈ సమావేశాలకు నూతన ఆలోచనలతో నూతన పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని సిఎస్ కోరారు.

చిత్రం.. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల పారిశ్రామికవేత్తలతో చర్చిస్తున్న టక్కర్