బిజినెస్

బాణసంచా వ్యాపారానికి చైనా దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: చైనానుంచి కుప్పలు తెప్పలుగా బాణసంచా వచ్చి పడ్డాయన్న వార్త దేశ రాజధానిలో ఆ వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. దేశంకోసం చైనా బాణసంచా కొనరాదంటూ జరిగిన ప్రచారం ప్రజల్లో బాగా ప్రభావం చూపించింది. చివరకు స్వదేశీ టపాకాయలు అమ్ముతున్నా నమ్మలేని పరిస్థితి నెలకొంది. తాము చైనా బాణసంచా అమ్మటం లేదని బోర్డులు పెట్టినా కొందరు ఆ మాటల్ని వినటం లేదు. ‘‘నేను ఎందుకు చైనా పటాకులను అమ్ముతాను. నేను దేశభక్తుణ్ణి. నా దుకాణంలో ఒక్కటి కూడా చైనా టపాకాయ లేదు. కానీ నా దగ్గరకు వచ్చే కస్టమర్లను ఎలా నమ్మించాలి? వాళ్లు వస్తున్నారు? ఒట్టి చేతులతో వెళ్లిపోతున్నారు. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపు ఇచ్చిన ప్రధాని వెంట నేనూ ఉంటా. కానీ కస్టమర్లు కూడా నన్ను నమ్మాలి’’ అని అమిత్ వర్మ అనే ఓ వ్యాపారి వాపోయాడు. ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో దీపావళి సందర్భంగా పెద్దఎత్తున బాణసంచా వ్యాపారం జరుగుతుంది. ఢిల్లీ ప్రజలు మూకుమ్మడిగా చైనా బాణసంచాను బహిష్కరించటంతో షాపులు వెలవెలపోతున్నాయి. అయితే కొంతమంది దుకాణదారులు మాత్రం చైనా బాణసంచాకు డిమాండ్ తగ్గలేదనే అంటున్నారు. స్వదేశీ బాణసంచా కంటే కనీసం 30శాతం తక్కువ ధరకు వస్తున్నందున వీటిని కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు.