బిజినెస్

గృహ రుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన ఐసిఐసిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 3: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంకు గురువారం తన గృహ రుణాల వడ్డీ రేట్లను తగ్గించింది. తాజాగా ప్రధాన ప్రత్యర్థి అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన గృహ రుణాల వడ్డీ రేట్లను 0.15 శాతం తగ్గించిన నేపథ్యంలో ఐసిఐసిఐ బ్యాంక్ సైతం అదే దారిలో నడిచింది. రూ. 75 లక్షల దాకా గృహ రుణాలపై వడ్డీ రేట్లను 0.15 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మహిళలకు ఈ రుణాలపై వడ్డీ రేటు 9.15 శాతంగా ఉంటుంది. ఇంతకు ముందు ఈ వడ్డీ రేటు 9.30 శాతంగా ఉండింది. కాగా, వేతన వర్గాలకు వడ్డీ రేటును 9.35 శాతంనుంచి 9.20 శాతానికి తగ్గించింది. నవంబర్ 2నుంచి ఈ కొత్త వడ్డీరేట్లు వర్తిస్తాయి.