బిజినెస్

ఆహార భద్రత దేశవ్యాప్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 3: కేంద్ర ప్రభుత్వం ఈ నెల నుంచి ఆహార భద్రతా చట్టాన్ని దేశమంతటికీ విస్తరించి 80 కోట్ల మంది ప్రజలకు అధిక సబ్సిడీపై బియ్యం, గోధుమలను అందజేయనుంది. ఇందుకోసం సంవత్సరానికి భారీ మొత్తంలో 1.4 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించనుంది. 2013లో పార్లమెంట్ ఆమోదించిన ఆహార భద్రతా చట్టాన్ని తమిళనాడు, కేరళ మినహా మిగిలిని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేస్తున్న విషయం విదితమే. అయితే నవంబర్ నుంచి తాము కూడా దీనిని అమలు చేయాలని తమిళనాడు, కేరళ నిర్ణయించడంతో ఈ చట్టం దేశ మంతటికీ విస్తరించినట్లయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టినప్పుడు 11 రాష్ట్రాల్లో మాత్రమే అమలవుతున్న ఆహార భద్రతా చట్టాన్ని ఇప్పుడు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేస్తుండటం సంతోషకరమని కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ గురువారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఈ చట్టం కింద ప్రభుత్వం ప్రతి వ్యక్తికీ రూపాయి నుంచి 3 రూపాయల ధరతో నెలకు 5 కిలోల చొప్పున అధిక రాయితీతో ఆహార ధాన్యాలను అందజేస్తోందని, గోధుమలను కిలో 2 రూపాయల చొప్పున, బియ్యాన్ని కిలో 3 రూపాయల చొప్పున అందజేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ రాయితీ కోసం ప్రభుత్వం నెలకు రూ.11,726 కోట్ల చొప్పున సంవత్సరానికి రూ.1,40,700 కోట్లను వెచ్చించనుందని పాశ్వాన్ వివరించారు. ఈ చట్టం కింద 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆహార ధాన్యాలను కేటాయించామని, ప్రస్తుతం ఈ కేటాయింపులు నెలకు దాదాపు 45.5 లక్షల టన్నులుగా ఉన్నాయని ఆయన తెలిపారు. దేశంలో 81.34 కోట్ల మందికి ఆహార భద్రత హక్కును కల్పించాలని నిర్దేశించుకున్న ప్రభుత్వం ప్రస్తుతం దాదాపు 80 కోట్ల మందికి ఈ హక్కును పొడిగించిందని పాశ్వాన్ చెప్పారు.
బహిరంగ మార్కెట్లోకి
10 లక్షల టన్నుల గోధుమలు
ఇదిలావుంటే, దేశీయంగా ఆహార ధాన్యాల లభ్యతను పెంపొందించి ధరలను అదుపు చేసేందుకు వీలుగా మిగులు నిల్వల నుంచి ప్రభుత్వం 10 లక్షల టన్నుల గోధుమలను బహిరంగ మార్కెట్లోకి విడుదల చేయనుందని పాశ్వాన్ వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు వ్యాపారులు ఇప్పటివరకూ 12 లక్షల టన్నుల గోధుమలను దిగుమతి చేసుకున్నారని, బహిరంగ మార్కెట్లో గోధుమల లభ్యత మరింత పెరిగేందుకు ఇది కూడా ఎంతగానో దోహదపడుతుందని ఆయన తెలిపారు.

చిత్రం.. ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్