బిజినెస్

నష్టాల్లో ప్రపంచ స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, నవంబర్ 5: ప్రపంచ స్టాక్ మార్కెట్లపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం కనిపిస్తోంది. అమెరికాసహా భారత్, జపాన్, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ నువ్వా-నేనా అన్న తీరులో ఉండటంతో మదుపరులు తమ పెట్టుబడులపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. నిన్నమొన్నటిదాకా హిల్లరీతో పోల్చితే వెనుకంజలో ఉన్న ట్రంప్.. ఎన్నికలు దగ్గరపడుతున్న ప్రస్తుత సమయంలో పుంజుకోవడం ప్రపంచ స్టాక్ మార్కెట్లను కలవరపెడుతోంది. దుందుడుకు స్వభావం కలిగిన ట్రంప్.. అగ్రరాజ్య అధ్యక్షుడైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం తప్పదన్న అభిప్రాయాలుండటమే దీనికి కారణం. దీంతో గత వారం, పది రోజులుగా ప్రపంచంలోని అన్ని ప్రధాన స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్ వరుసగా తొమ్మిదోరోజు నష్టాలపాలవగా, 1980 నుంచి గమనిస్తే ఇన్నిరోజులు నష్టపోవడం ఇదే ప్రథమం. బ్రిటన్ సూచీ సైతం 1.4 శాతం పడిపోగా, జపాన్ సూచీ 1.3 శాతం, ఫ్రాన్స్ సూచీ 0.8 శాతం, జర్మనీ సూచీ 0.7 శాతం మేర పతనమయ్యాయి. భారతీయ స్టాక్ మార్కెట్లూ గత వారం రోజులుగా నష్టాల్లోనే కదలాడుతున్నది తెలిసిందే. మరోవైపు స్టాక్ మార్కెట్లు నష్టపోతుండటంతో మదుపరులు తమ పెట్టుబడులకు ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషిస్తున్నారు. ఈ క్రమంలోనే డాలర్ విలువ క్షీణించగా, బంగారం ధరలు పెరిగాయి.