బిజినెస్

ఐసిఐసిఐకి మొండి బకాయిల దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 7: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 13 శాతం క్షీణించింది. ఒక్కసారిగా ఎగిసిన మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ) కారణంగా ఈసారి 2,979 కోట్ల రూపాయలకే పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో 3,419 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో బ్యాంక్ తెలియజేసింది. అయితే ఆదాయం మాత్రం ఈసారి పెరిగింది. 32,435 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు ఇదే వ్యవధిలో బ్యాంక్ ఆదాయం 25,138 కోట్ల రూపాయలుగా ఉంది. ఇదిలావుంటే స్టాండలోన్ ఆధారంగా బ్యాంక్ లాభం ఈ జూలై-సెప్టెంబర్‌లో గతంతో పోల్చితే 2.3 శాతం పెరిగి 3,102 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు 3,030 కోట్ల రూపాయలుగా ఉంది. స్టాండలోన్ ఆదాయం కూడా 16,106 కోట్ల రూపాయల నుంచి 22,759 కోట్ల రూపాయలకు ఎగబాకింది. అయితే నికర వడ్డీ ఆదాయం 5,253 కోట్ల రూపాయలతో దాదాపు సమానంగా ఉంది. ఇక బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 3.77 శాతం నుంచి 6.82 శాతానికి పెరిగితే, నికర నిరర్థక ఆస్తులు కూడా 1.65 శాతం నుంచి 3.57 శాతానికి చేరాయి. అంటే 942 కోట్ల రూపాయల నుంచి 7,083 కోట్ల రూపాయలను తాకాయి. ఇదే బ్యాంక్ లాభాన్ని ప్రభావితం చేసింది.