బిజినెస్

ద్రవ్యోల్బణం గణాంకాలు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్)గాను ఈ వారం ఆయా సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలతోపాటు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అనూహ్య విజయం అనంతరం నెలకొన్న పరిణామాలు భారతీయ మార్కెట్లపై అధిక ప్రభావం చూపవచ్చని మెజారిటీ నిపుణులు విశే్లషిస్తున్నారు. అలాగే గత నెల అక్టోబర్‌కుగాను విడుదలయ్యే వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు ముఖ్యమని వారు చెబుతున్నారు.
దీంతోపాటు ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మదుపరులను ప్రభావితం చేస్తాయని పేర్కొంటున్నారు. కాగా, నల్లధనం, నకిలీ కరెన్సీ నిర్మూలన కోసం 500, 1,000 రూపాయల నోట్ల రద్దు నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను మదుపరులు దగ్గరగా గమనిస్తున్నారని పలువురు మార్కెట్ విశే్లషకులు అభిప్రాయపడ్డారు.
నేడు మార్కెట్లకు సెలవు
మరోవైపు సోమవారం స్టాక్ మార్కెట్లకు సెలవు. గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 14న సెలవు దినమని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లు ప్రకటించాయి.
తిరిగి మంగళవారం (నవంబర్ 15) యథాతథంగా స్టాక్స్ ట్రేడింగ్ కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేశాయి.