బిజినెస్

ఇక వాట్సాప్ వీడియో కాలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 15: వీడియో కాలింగ్‌ను వాట్సప్ ప్రారంభిస్తోంది. ఇప్పటికే ప్రత్యర్థి యాప్‌లు స్కైప్‌తోపాటు యాపిల్‌కు చెందిన ఫేస్‌టైమ్, గూగుల్ డ్యూయో వీడియో కాలింగ్‌ను మొబైల్ వినియోగదారులకు పరిచయం చేసినది తెలిసిందే. ఈ క్రమంలో వాట్సాప్ కూడా వీడియో కాలింగ్‌ను తీసుకొస్తోంది. మరికొద్ది రోజుల్లో 100 కోట్లకుపైగా ఉన్న వాట్సాప్ వినియోగదారులు వీడియో కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారని ఆ సంస్థ తెలిపింది. మేసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లలో వాట్సాప్ అన్నింటికంటే ముందున్నది తెలిసిందే. ఫోటోలు, టెక్స్ట్ సందేశాలను వాట్సాప్ ఖాతాల ద్వారానే మొబైల్ వినియోగదారులు అధికంగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో వీడియో కాలింగ్ అందుబాటులోకి వస్తే వాట్సాప్ వినియోగం మరింత పెరిగి దాని కస్టమర్లు కూడా ఎక్కువవుతారని సోషల్ మీడియా నిపుణులు విశే్లషిస్తున్నారు. ఐఫోన్, ఆండ్రాయడ్, విండోస్ ఫోన్ వినియోగదారులు వాట్సాప్ వీడియో కాలింగ్‌ను పొందవచ్చు.