బిజినెస్

నోట్ల రద్దు కష్టాలు తాత్కాలికమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: కేంద్రం రద్దు చేసిన పెద్ద నోట్ల కష్టాలు తాత్కాలికమేనని, దీర్ఘకాలంలో ఆర్ధిక రంగం ఊపందుకుంటుందని, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్ర వాణిజ్య సంఘాల సంస్ధ (ఎఫ్‌టాప్సీ) ఉపాధ్యక్షుడు గౌర శ్రీనివాస్ అన్నారు. చట్టానికి లోబడి పనిచేసే సంస్ధలు, వ్యక్తులకు పెద్ద నోట్ల వల్ల భయం ఉండదని, అక్రమమార్గాల ద్వారా ఆదాయాన్ని ఆర్జించే వారికే ఆందోళన అని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారన్నారు. పెద్ద నోట్ల రద్దు, మార్కెట్‌పై ప్రభావం అనే అంశంపై ఇక్కడ జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, పాకిస్తాన్ భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు నకిలీ కరెన్సీని డంప్ చేస్తోందని, దీని వల్ల ఉగ్రవాదం పెచ్చుమీరుతోందన్నారు. దేశంలో లెక్కాపత్రం లేని అక్రమ సొమ్ముపై ఉక్కుపాదం మోపేందుకు పెద్ద నోట్లరద్దు అవసరమని, అయతే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఎఫ్‌టాప్సీ ఉపాధ్యక్షుడు చార్టెర్డ్ అకౌంటెంట్ అరుణ్ లుహర్కా మాట్లాడుతూ, దేశంలోని కరెన్సీలో 86 శాతం రద్దయిన పెద్ద నోట్లదేనన్నారు. 14 లక్షల కోట్లున్న ఈ నోట్ల రద్దు అయ్యాయన్నారు. దేశంలో దాదాపు లక్ష బ్యాంకు శాఖలు, రెండు లక్షల ఎటిఎంలు, 1.3 లక్షల పోస్ట్ఫాసులు ఉన్నాయని చెప్పారు. రియల్ ఎస్టేట్, నిర్మాణం, ఆభరణాల రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. కానీ బ్యాంకులు మాత్రం బలపడుతాయన్నారు. పెద్ద మొత్తంలో రద్దయిన నోట్లను డిపాజిట్ చేస్తే ఎదురయ్యే పన్ను సమస్యలను కేంద్రం పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. హైకోర్టు న్యాయవాది వై.రత్నాకర్ మాట్లాడుతూ, పరిశ్రమలు, వాణిజ్య రంగాలు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.

చిత్రం.. ఎఫ్ టాప్సీ సదస్సులో ప్రసంగిస్తున్న పారిశ్రామికవేత్తలు