బిజినెస్

నిర్మాణ రంగం కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/నాగర్‌కర్నూల్, నవంబర్ 20: నిర్మాణ రంగం కుదేలైంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తం గా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తంభించిపోయంది. అవును.. నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలకుతోడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రియల్ ఎస్టేట్ లావాదేవీలను దెబ్బతీసింద. నల్లధనం, నకిలీ కరెన్సీ నిర్మూలనకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు దేశీయ మార్కెట్లనూ ప్రభావితం చేస్తున్నది తెలిసిందే. ముఖ్యంగా నిర్మాణ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావమే పడింది. భారీ లావాదేవీ లకు కేంద్రమైన నిర్మాణ రంగాన్ని పెద్ద నోట్ల రద్దు కుదిపేయగా, రెక్కాడితేగాని డొక్కాడని బతుకులకు గత 10 రోజుల నుంచి పనులే లేకపోయాయ. నిజానికి కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో పురుడు పోసుకున్న నూతన జిల్లాల్లో నిర్మాణ రంగం పుంజుకుంది. అయతే పెద్ద నోట్ల రద్దుతో పరిస్థితులు మొత్తం మారిపోయాయ. నాగర్‌కర్నూల్ జిల్లానే తీసుకుంటే ఇసుక కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వ నిర్మాణ పనులతోపాటు గృహ నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. అక్కడక్కడ లభించే కొద్దిపాటి ఇసుకతో నామమాత్రంగా నిర్మాణ పనులు చేస్తున్న తరుణంలో పుండుమీద కారం చల్లినట్లుగా పెద్దనోట్ల రద్దు రావడంతో కాస్త పనులు కూడా నిలిచిపోయాయి. 500, 1,000 రూపాయల నోట్లు మార్కెట్‌లో చెలామణి కాకపోవడం, కొత్త నోట్లు అందుబాటులోకి రాకపోవడమే కారణం. నిర్మాణ పనులు చేపట్టిన వారివద్ద పాత నోట్లే ఉండటంతో నిర్మాణ పనులకు అవసరమైన సిమెంట్, ఉక్కు, కంకర, ఇటుక, ఇసుక తదితరాలను కొనడానికి వీల్లేకుండా పోయంది. బ్యాంకుల వద్ద బారులు తీరిన జనాన్ని చూసి, చాలామంది పనులను వాయదా వేసుకుంటుండగా, దీనిపైనే ఆధారపడ్డ వారి పరిస్థితి అగమ్యగోచ రంగా తయారైంది. మేస్ర్తిలకు, కూలీలకు ఇచ్చే రోజువారి కూలీకి అవసరమైన కొత్త నోట్లుగాని, వంద, యాభై నోట్లుగాని లేకపోవడం కూడా సమస్యను తీవ్రతరం చేస్తోంది. ఒక్క నాగర్‌కర్నూల్ ప్రాంతంలోనేగాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌సహా దేశం లోని అన్ని రాష్ట్రాలదీ ఇంతే సంగతి. ఫలితంగా రియల్టర్లు, యజమానులు నిర్మాణ పనులను పూర్తిగా నిలిపివేస్తున్నారు. దీంతో అటు ఇసుక కొరత, ఇటు పెద్ద నోట్ల రద్దుతో నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయనట్లైంది. తద్వారా వీటిపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న కుటుంబాలు వీధిన పడ్డట్లైంది. మెస్ర్తిలు, కూలీలతోపాటు కరెంటు పనులు చేసేవారు, ప్లంబర్లు ఇలా గృహ నిర్మాణావసర రంగాలకు చెందిన వారందరికీ ఉపాధి దూరమైంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్ద నోట్ల రద్దు సమస్య కనిపిస్తోంది. నగరాలు, పట్టణాలతో పోల్చితే ఇసుక కొరత ఇక్కడ తక్కువే అయనప్పటికీ మిగతా అవసరాలకు కొత్త నోట్లు కావాల్సి వస్తోంది. దీంతో సరైన బ్యాంకింగ్ సేవలు లేక, కొత్త నోట్లు చేతికిరాక పనులు ఎక్కడివక్కడే అన్న చందంగా తయారయ్యాయ. కాగా, కొత్త జిల్లాలు ఏర్పడక ముందు ఇసుక దొరికేదని, కానీ జిల్లాల ఏర్పాటు తరువాత ఇసుక లభ్యత తగ్గిందని, ప్రభుత్వం నిర్దేశించిన ధరను చెల్లించి తెచ్చుకుందామనుకున్నా కుదరట్లేదని పలువురు గృహ నిర్మాణదారులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇసుక సమస్యను పరిష్కరించడంతోపాటు రద్దు చేసిన పెద్ద నోట్ల స్థానంలో కొత్త నోట్లుగాని, వంద రూపాయల నోట్లుగాని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తద్వారా నిర్మాణ పనులు మళ్లీ పుంజుకునేలా చూడాలని అటు వ్యాపారులు, ఇటు రియల్టర్లు అంటున్నారు.

చిత్రం.. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఆగిపోయన గృహ నిర్మాణ పనులు