బిజినెస్

పారిశ్రామిక ప్రగతికి నిరంతర విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 21: పరిశ్రమల్లో ఉత్పత్తికి ఎటువంటి అంతరాయాలు లేకుండా నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపీడిసిఎల్) ప్రత్యేక కార్యాచరణను తయారు చేస్తోంది. రానున్న వేసవి సీజన్‌తోపాటు ఏ ఒక్కరోజూ విద్యుత్ కోతలు, అంతరాయాలు, సరఫరాలో లోపాలు లేకుండా నిరంతర విద్యుత్ ద్వారా పారిశ్రామిక ఉత్పత్తికి విఘాతం కలుగకుండా చేయాలని సంస్థ లక్ష్యంగా చేసుకుంది. పరిశ్రమలకు చెందిన హైటెన్షన్ (హెచ్‌టి) వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సరఫరా నాణ్యతను పెంచడంలో భాగంగా ఈపీడీసిఎల్ కార్పొరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఐదు జిల్లాల అధికారులతో సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎమ్‌ఎమ్ నాయక్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో పారిశ్రామిక రంగం మరింతగా ప్రగతి సాధించాలంటే నిరంతర విద్యుత్ సరఫరా ఒక్కటే మార్గమన్నారు. అందువల్ల దీనికి అవసరమైన సాంకేతి వనరులు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారానికి ‘కైజాలా యాప్’ను ఉపయోగించుకోవచ్చని, దీని ద్వారా ఫిర్యాదులు చేస్తే తక్షణ పరిష్కారం లభిస్తుందన్నారు. దీంతోపాటు టోల్ ఫ్రీ నెంబర్ 1912ను సంప్రదించవచ్చని సూచిం చారు. కొంతమంది పరిశ్రమల యాజమాన్యాలు వోల్టేజీ స్థాయిని పెంచాలని కోరుతున్నారని, మరికొంతమంది బిల్లింగ్, ఇంధన సర్‌చార్జీ సర్దుబాటు సమస్యలను దృష్టికి తెస్తున్నారని అధికారులు సిఎండితో అన్నారు. దీంతో వీటిని పరిశీలించి తగిన న్యాయం జరిగేటట్టు చర్యలు తీసుకుంటామని, వీటన్నింటికీ తక్షణ పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాగా, నాణ్యతను పెంచాలనే లక్ష్యంతో మరిన్ని విద్యుత్ సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల సంఖ్యను అన్ని ప్రాంతాల్లో పెంచేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సంస్థ డైరెక్టర్లు ఫైనాన్స్ టివియస్ చంద్రశేఖర్, చీఫ్ జనరల్ మేనేజర్లు పివివి సత్యనారాయణ, కెయస్‌ఎన్ మూర్తి, జి శ్రీనివాసరెడ్డి, విశాఖ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎమ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ఏపీఈపీడిసిఎల్ సిఎండి నాయక్