తెలంగాణ

కాంగ్రెస్ ప్రచారం ఉద్ధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ మరింత ఉధృతం చేసింది. ఈ నెల 29న ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్, 30న ఎఐసిసి నాయకుడు గులాంనబీ ఆజాద్ గ్రైటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. వారిరువురి రాక సందర్భంగా పాతనగరంలోని రెండు ప్రధాన బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా సికింద్రాబాద్ ప్రాంతంలో రోడ్-షోలు నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు. ఇప్పటికే టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సోమవారం ఆయన సైదాబాద్, ఐ.ఎస్. సదన్, గౌలిపురా, మూసారాంబాగ్ డివిజన్లలో ఏర్పాటైన బహిరంగ సభల్లో ప్రసంగించారు. మరోవైపు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క సోమవారం నగరంలోని అనేక డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. ఇలాఉండగా సెటిలర్లు ఎక్కువగా ఉండే డివిజన్లలో ఎపి కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవితో ప్రచారం చేయించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు చిరంజీవికి ఆహ్వానం పంపించినట్లు టిపిసిసి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.ఇలాఉండగా ఎఐసిసి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు చైర్మన్‌గా ప్రచార కమిటీని ఏర్పాటు చేసినట్లు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. ఈ కమిటీలో సభ్యులుగా రాజ్యసభ సభ్యులు నంది ఎల్లయ్య, ఎంఎ ఖాన్, రేణుకా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, రాష్ట్ర మాజీ మంత్రులు పి. సబితా ఇంద్రారెడ్డి, ఎం. శశిధర్ రెడ్డి, జి ప్రసాద్ కుమార్, మాజీ ఎంపి అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డిని నియమించారు. గ్రేటర్ మేయర్ అభ్యర్థిగా మాజీ మంత్రి ఎం. ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్‌ను ఆయన ప్రకటించారు. విక్రమ్‌గౌడ్ జాంబాగ్ నుంచి పోటీ చేస్తున్నారు.
మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్‌కు జరగనున్న ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిగా దివంగత పట్లోళ్ళ కిష్టారెడ్డి తనయుడు పట్లోళ్ళ సంజీవరెడ్డిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ మేరకు ఆయనకు ఎ-్ఫరం, బి-్ఫరం అందజేసినట్లు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. టిపిసిసి ఎస్‌సి సెల్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్‌ను ఎఐసిసి నియమించిందని ఆయన చెప్పారు.