రాష్ట్రీయం

చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష సిఎం చంద్రబాబుని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు చంద్రబాబు రెండు రోజుల నుంచి విశాఖలోనే బస చేస్తున్నారు. మరో రెండు రోజులు ఇక్కడే ఉంటారు. ఓపక్క ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరుగుతోంది. అంతర్జాతీయంగా అందరి కళ్లూ ఆంధ్రపైనే ఉన్నాయి. ఇటువంటి సమయంలో ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహారదీక్షకు దిగడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. శుక్రవారం ఉదయం 9గంటల సమయంలోనే ఆయన సర్క్యూట్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఫిషింగ్ హార్బర్‌లో జెట్టీని ప్రారంభించడానికి వెళ్లిన చంద్రబాబు ఫొన్‌లో చాలాసేపు సంభాషించారు. తిరిగి సర్క్యూట్ హౌస్‌కు చేరుకున్నారు. కాపుల రిజర్వేషన్‌పై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు యనమల రామకృష్ణుడు, కెఇ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావుతో సమావేశమై సుదీర్ఘ మంతనాలు సాగించారు. సమావేశంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, పరకాల ప్రభాకర్ సైతం పాల్గొన్నారు. కులాల పేరిట రాష్ర టంలో చిచ్చు రగిలించాలని చూడటం బాధాకరమని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. బీసీలైనా, కాపులైనా ఉద్రిక్తతలు తలెత్తేలా ఆందోళనలకు దిగడం మంచిదికాదని హితవు పలికారు. ఈ నేపథ్యంలోనే శాంతి భద్రతల అడిషనల్ డిజిపి ఠాకూర్ సిఎం చంద్రబాబును కలిసి గంటకు పైగా చర్చించారు. తరువాత కాపు కమిషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ్య, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, తూర్పు గోదావరి జిల్లా నుంచి బొడ్డు భాస్కరరామారావు, పిఠాపురం ఎమ్మెల్యే వర్మ కూడా చంద్రబాబును కలిశారు. తరువాత హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ చట్టం తనపని తాను చేసుకుపోతుందని, ఆందోళనల్లో హద్దుమీరితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. తమను ఇందులోకి లాగద్దంటూ తప్పించుకుని తిరగడం గమనార్హం. మొత్తంమీద చంద్రబాబు శుక్రవారం విశాఖలో అన్యమనస్కంగానే గడిపారు. ఓపక్క ఫ్లీట్ రివ్యూ నిర్ణీత సమయాలకు హాజరు కావల్సివచ్చింది. మరోపక్క రాష్ట్రంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దాల్సిన బాధ్యతా ఆయనపైనే ఉండడంతో టెన్షన్‌గా కనిపించారు. విశాఖలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు అనేక దేశాలనుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ విషయం అంతర్జాతీయికి చేరుకుందని, వాళ్ల నుంచి ఫోన్‌లు వస్తున్నాయంటూ చంద్రబాబు సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం.