ఆంధ్రప్రదేశ్‌

‘కాల్‌మనీ’పై విచారణ సంఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర్వులు జారీ చేసిన ఏపి సర్కార్

హైదరాబాద్, మార్చి 10: ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన కాల్‌మనీ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు విచారణ సంఘాన్ని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.ఎస్.అప్పారావును విచారణ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి ఠక్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు నెలల్లోగా నివేదికను అందజేయాలని స్పష్టం చేశారు.
9 పాలిటెక్నిక్ కళాశాలలకు కొత్త భవనాలకు నిధులు మంజూరు
ఆంధ్రప్రదేశ్‌లో 9 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు కొత్త భవనాలను నిర్మించేందుకు గాను రూ.62.59 కోట్లకు పరిపాలనపరమైన అనుమతిని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాబార్డు సహకారంతో ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు తెలిపింది. విశాఖ జిల్లా పెందుర్తి, అనంతపురం జిల్లా మడకసిర, గుంటూరు మైనార్టీస్, కడప జిల్లా వేంపల్లి, ఓబుళాపురం, జమ్మలమడుగు, సింహాద్రిపురం, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, ధర్మవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు కొత్త భవనాల నిర్మాణానికి ఈ నిధులను వెచ్చించనున్నట్లు తెలిపింది.
నన్నయ విశ్వవిద్యాలయంలో 39 అధ్యాపక పోస్టులు మంజూరు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉన్న ఆదికవి నన్నయ యూనివర్శిటీలో 39 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నిషేధం ఎత్తివేత
ఎపిలో పదోన్నతులు, బదిలీలు, నియామకాలపై ఇప్పటి వరకు ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగుల కేటాయింపు జరుగుతున్నందున నిషేధం విధించిన ప్రభుత్వం, కమలనాధన్ కమిటీ పని దాదాపు పూర్తయినందున ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు నిషేధం ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.