బిజినెస్
కేసులను ఉపసంహరిస్తేనే గ్యాస్ ధరల స్వేచ్ఛ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 12 March 2016
రిలయన్స్‌కు కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ
న్యూఢిల్లీ, మార్చి 11: గ్యాస్ ధరల విధానంపై కేసులను ఉపసంహరించుకోని పక్షంలో కెజి-డి6 బ్లాక్‌లో ఉత్పత్తికి దూరంగా ఉన్న గ్యాస్ నిక్షేపాలకు మార్కెట్ ధరలను అనుమతించేది లేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ.. ఇబ్బందికర పరిస్థితులున్న సహజవాయువు క్షేత్రాల్లో ఉత్పత్తి చేయలేకపోతున్న నిక్షేపాలకు మార్కెటింగ్ స్వేచ్ఛను ఇచ్చింది. ఈ క్రమంలో కేసులను వెనక్కి తీసుకుంటేనే కెజి-డి6లో తమ నిర్ణయం వర్తిస్తుందని ప్రభుత్వం రిలయన్స్‌కు స్పష్టం చేసింది.