రాష్ట్రీయం

హామీలు @ 6లక్షల కోట్లు! ఎక్కడినుంచి తెస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకులే భయపడే పరిస్థితి వచ్చింది
‘డబుల్’కు లక్షా 40 వేల కోట్లు తేగలరా?
ఎస్సీ, ఎస్టీల భూ పంపిణీకి ఎంతవుతుంది?
రూ. 50వేల కోట్లతో విశ్వనగరం సాధ్యమా?
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన జానారెడ్డి

హైదరాబాద్, మార్చి 17: టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే రూ. 6 లక్షల కోట్లకు పైగా అప్పు చేయాల్సి ఉంటుందని, హామీలన్ని అమలు కావాలంటే మూడు పర్యాయాలు అధికారంలో కొనసాగాల్సి ఉంటుందని ప్రతిపక్ష నాయకుడు కె జానారెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి వచ్చే ఆదాయం నుంచి ఇంత పెద్ద మొత్తం అప్పుతీర్చాలంటే ఎంత కాలం పడుతుందో ఆలోచించారా? అని జానారెడ్డి ప్రశ్నించారు. శాసనసభలో గురువారం బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చపై మాట్లాడుతూ, ఇంత పెద్దమొత్తాన్ని ఎలా తీర్చుస్తారని బ్యాంకులు వెనుకడుగు వేసే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. రాష్టవ్య్రాప్తంగా 20 లక్షల మంది పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది, వీటిని కట్టడానికి రూ. లక్ష 40 వేల కోట్లు ఖర్చు అవుతుందని జానారెడ్డి లెక్కలతో సహా వివరించారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది, ఇంతవరకూ 500 ఇళ్లు కూడా కట్టలేకపోయారు, కనీసం ఏడాదికి 50 వేల ఇళ్లయినా నిర్మించకుండా 20 లక్షల ఇళ్లు ఎప్పుడు పూర్తిచేస్తారని జానారెడ్డి నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఐఎవై పథకం కింద ఇళ్లు నిర్మించడానికి రాష్ట్రానికి రూ. 300 కోట్లు వస్తాయి, వాటినైనా రాష్ట్ర ప్రభుత్వ వినియోగించుకోలేదని విమర్శించారు. భూమి లేని ఎస్‌సి, ఎస్‌టిలకు ఉచితంగా మూడు ఎకరాల భూమి కొనుగోలు చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్టవ్య్రాప్తంగా 20 నుంచి 30 లక్షల ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాలకు భూమి కొనుగోలు చేసి ఇవ్వడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో లెక్క కట్టారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి 50 వేల కోట్ల నుంచి 70 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తామని చెబుతున్నారు, మిషన్ భగీరథకు మరో 36 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంటున్నారు, మరి ఇంత పెద్ద మొత్తం నిధులను ఎక్కడి నుంచి తీసుకొస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం 2014-15 బడ్జెట్‌లో లక్ష కోట్లతో బడ్జెట్ రూపొందించగా, అందులో 62 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, అలాగే 2015-16లో లక్ష 15 వేల కోట్లతో రూపొందించిన బడ్జెట్‌లో 15 వేల కోట్లు కోత పెట్టినప్పుడు, ఈసారి మళ్లీ లక్ష 30 వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్డడం అభూతకల్పన కాదా? అని జానారెడ్డి నిలదీశారు. గత బడ్జెట్‌లో ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలకు రూ. 1100 కోట్లు కేటాయించి అందులో కేవలం రూ. 300 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని జానారెడ్డి గుర్తు చేశారు. ఎస్‌సిలకు కేటాయించిన బడ్జెట్‌లో 34 శాతం, ఎస్‌టిలకు కేటాయించిన బడ్జెట్‌లో 42 శాతం, మైనార్టీలకు కేటాయించిన బడ్జెట్‌లో 30 శాతం మాత్రమే ఖర్చు చేసిందని జానారెడ్డి లెక్కలతో సహా వివరించారు.