రాష్ట్రీయం

కాపులకు బుజ్జగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులధ్రువీకరణ పత్రాల జారీ
హైదరాబాద్, డిసెంబర్ 29 : ఆంధ్రప్రదేశ్‌లో కాపు కులస్తులు (కాపు, తెలగ, బలిజ, ఒంటరి) ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్న వేళ, ఈ వర్గాన్ని బుజ్జగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గుజరాత్‌లో గుజ్జర్లు జరిపిన ఆందోళన తరహాలో ఎపిలో కూడా కాపులు ఆందోళన చేపట్టే అవకాశం ఉండటంతో చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది. బిసి, ఎస్‌సి, ఎస్‌టిలకు అందిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల తరహాలోనే కాపుల కోసం సంక్షేమ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. అవసరమైన నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం రూపొందించిన పథకాలు, కార్యక్రమాలను ఈ కులాలవారికి నేరుగా అందించేందుకు వీలుగా కులధృవీకరణ పత్రాలు (క్యాస్ట్ సర్ట్ఫికెట్లు) ఇవ్వాలని తాజాగా నిర్ణయించారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లకు సూచనలు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పేరుతో ప్రత్యేకంగా జీఓ జారీ చేశారు. కాపుల ఆందోళనకు తావు ఇవ్వకుండా చూసేందుకు వీరి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలు ప్రారంభించింది. ఇటీవలే రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. కంపెనీల చట్టం కింద దీన్ని ఏర్పాటు చేయడంతో దీనికి చట్టబద్ధత కల్పించినట్టయింది. కాపుల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రణాళికలను రూపొందించారు. ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక నియమావళి రూపొందించి అమలు చేయడం ప్రారంభించారు.