ఆంధ్రప్రదేశ్‌

14 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 10: రాష్టవ్య్రాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ కేంద్రం విధివిధానాల ప్రకారం 5 శాతం తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. అయితే ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 8 శాతం తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అంగీకరించిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం తడిచినప్పటికీ కొనుగోలు చేయాల్సిందిగా అధికారులను అదేశించడం జరిగిందన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే 4.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నులు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 1.75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు. దేశంలో 2.50 లక్షలు గృహాలు నిర్మించేందుకు కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని, అందులో 1.90 లక్షల గృహాలు రాష్ట్రానికి కేటాయించిందన్నారు. రాష్ట్రానికి కేటాయించిన వాటిల్లో తన సొంత నియోజకవర్గమైన చిలకలూరిపేటలో 4,512 గృహాలు నిర్మించనున్నట్లు తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా నిర్వహిస్తున్న జనచైతన్యయాత్రలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ప్రజల అభీష్టం మేరకు 10 లక్షల రేషన్‌కార్డులను అర్హులందరికీ ఇవ్వటం జరుగుతుందన్నారు. ప్రతి రైతూ తన పొలంలో 2సెంట్లు కేటాయించి నీటి గుంటలు తీసుకోవాలని సూచించారు. తద్వారా నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.